బీజేపీ బైట్ : కేసీఆర్ కు మ‌తిమ‌రుపు ఎక్కువ‌నుకుంటా ?

-

దేశాన్ని దోచేస్తున్న నేత మోడీ అని అంటున్నారు.. ఇదే మాట తెలంగాణ వాకిట ప‌దే ప‌దే వినిపిస్తోంది. ఆ దోపిడీని నిలువ‌రించే బాధ్య‌త అని కూడా అంటున్నారు.. బాగుంది. కాళేశ్వ‌రం ప్రాజెక్టులో అవినీతి క‌థేంటి అని అంటోంది బీజేపీ. ఇప్ప‌టికీ ప‌లు ప్రాజెక్టుల నిర్వాసితుల‌కు మీరు చేసిన సాయం ఏంటి ? ప‌థ‌కాలు అంటే టీఆర్ఎస్ నేత‌ల‌కూ వారి బిడ్డ‌ల‌కేనా అని కూడా ప్ర‌శ్నిస్తోంది. బీజేపీ జాతీయ కార్య‌వ‌ర్గ స‌మావేశాలు రెండు రోజుల పాటు హైద్రాబాద్ లో జ‌ర‌గ‌నున్న నేప‌థ్యంలో ఇటువంటి మాట‌లే ఎక్కువ‌గా కాషాయ శిబిరం నుంచి వినిపిస్తున్నాయి. వీటిని గులాబీ ద‌ళ‌ప‌తి విని ఆచ‌ర‌ణాత్మ‌క స‌మాధానం ఒక‌టి ఇస్తే మేలు.

బీజేపీని ఉద్దేశించి సాలు మోడీ సంప‌కు మోడీ అంటూ హోర్డింగ్ లు ఏర్పాటుచేశారు టీఆర్ఎస్ నాయ‌కులు. ఓ దేశ ప్ర‌ధాని రాక నేప‌థ్యంలో బై బై మోడీ అంటూ అధికారంలో ఉన్న స్థానిక ప్ర‌భుత్వం ఈ విధంగా చేయ‌డం వారి విజ్ఞ‌తకే వ‌దిలేద్దాం. కానీ ఆ విధంగా చేయ‌డం వ‌ల్ల వ‌చ్చే ప్ర‌యోజ‌నం ఏంటి అన్న‌ది కూడా ఆలోచించాలి. నేను ఈ దేశ ప్ర‌ధానిని ప్ర‌శ్నిస్తాను అని అంటాడు ప్ర‌కాశ్ రాజ్.. అందులో త‌ప్పేం లేదు కానీ ఆయ‌న హైద్రాబాద్ కు వ‌చ్చిన‌ప్పుడే ఈ ప్ర‌శ్న‌లు సంధించి ఏం సాధిస్తారు.

ఎలానూ ఇప్ప‌టిదాకా ఇవే ప్ర‌శ్న‌లు సంధించి ఉన్నారు కూడా! వాటికి ఎప్ప‌టిక‌ప్పుడు మీకు బీజేపీ స‌మాధానాలు ఇస్తుంది కూడా ! రెండు ప్ర‌భుత్వాలు ప‌ర‌స్ప‌ర స‌మ‌న్వ‌యంతో ప‌నిచేయాల్సిన చోట ఈ విధంగా కొట్టుకోవ‌డం అన్న‌ది ఏ మాత్రం భావ్యం కాదు. కానీ కొట్టుకోవ‌డం మరియు తిట్టుకోవ‌డం త‌రువాత న‌వ్వుకోవ‌డం అన్న‌వి రాజ‌కీయాల్లో భాగం క‌నుక ఇప్పుడేం అన‌లేం.. వాటి గురించి ఏం చెప్ప‌లేం కూడా !

రైతు బంధు పేరిట 57 వేల కోట్ల రూపాయ‌లకు పైగా నిధులు జ‌మ చేశామ‌ని టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అంటోంది. కానీ ఆ పాటి నిధులు ఇచ్చాక ధాన్యం కొనుగోలు బ‌కాయిలు మరిచిపోయారా అని ప్ర‌శ్నిస్తోంది విప‌క్ష బీజేపీ. నాలుగు వేల కోట్ల రూపాయ‌లు ధాన్యం కొనుగోలు బ‌కాయిల గురించి మాట్లాడ‌కుండా ఉంటే ఎలా అని కూడా ప్ర‌శ్నిస్తోంది. వీటిపై తెలంగాణ రాష్ట్ర స‌మితి నాయ‌కులు మాట్లాడితే మేలు.

Read more RELATED
Recommended to you

Exit mobile version