ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి విషయంలో రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు తీవ్రస్థాయిలో ఏపీ ప్రభుత్వం పై మండిపడుతూ నిరసనలు ఆందోళనలు చేస్తున్న విషయం అందరికీ తెలిసినదే. ఇదే తరుణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా అమరావతి ప్రాంతంలో పర్యటించి రాజధానిని తరలిస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కామెంట్ చేసి ఈ విషయాన్ని ఢిల్లీలో ఉన్న కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్తానని తెలిపి ఇటీవల ఢిల్లీ పర్యటన చేపట్టారు పవన్ కళ్యాణ్.
అయితే ఢిల్లీలో పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటన కి బీజేపీ పార్టీ పెద్దల నుండి సరైన రెస్పాండ్ రానట్టు ఢిల్లీ మరియు ఏపీ రాజకీయాల వినబడుతున్న టాక్. అయితే చివరాకరికి బిజెపి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నడ్డా తో కలిసి సమావేశమైన పవన్ కళ్యాణ్ కి ఆ పార్టీ నుండి బంపర్ ఆఫర్ డీల్ అందినట్లు సమాచారం.
ప్రశ్నించడం కోసం రాజకీయాల్లో అడుగు పెట్టిన పవన్ కళ్యాణ్ కి బీజేపీ ఇచ్చిన ఆఫర్…జనసేన పార్టీని బిజెపి పార్టీలో విలీనం చేసి భవిష్యత్తు రాజకీయాలలో కలిసి పనిచేయాలని ఒక పక్క సినిమాలు చేసుకుంటూనే మరోపక్క రాజకీయాల్లో కూడా రాణించే ఆఫర్ ఇచ్చినట్లు వచ్చే స్థానిక ఎన్నికల లోపు ఏదో విషయం తేల్చాలని పవన్ కళ్యాణ్ కి సూచించినట్లు వార్తలు వినబడుతున్నాయి. మరి భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని బీజేపీ లో విలీనం చేస్తారో లేదో చూడాలి.