మంత్రి హరీశ్ రావు అభ్యర్థి సుజాత కంటే ఎక్కువగా ప్రచారం చేస్తూ దుబ్బాకలోనే ఎక్కువ సమయం గడుపుతున్నారని, అధికారులపై ఒత్తిడి తెస్తున్నారని ఫైర్ అవుతున్నారు టీ బీజేపీ నేతలు. ఎంపీ బండి సంజయ్ అక్రమ అరెస్టు పై నిరసన తెలిపిన ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ సిద్దిపేట సీపీ వ్యవహరిస్తున్న తీరు ఏమాత్రం బాగోలేదన్నారు. సిద్దిపేట సీపీని వెంటనే బదిలీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఇన్చార్జి మంత్రి హరీశ్ రావును ఎన్నికల సంఘం తక్షణమే ప్రచారం నుంచి వెనక్కి పిలవాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా అన్ని పార్టీలకూ ప్రచారం చేసుకునే హక్కు ఉందని, అయితే బీజేపీ అగ్రనేతలు ప్రచారం చేయకుండా అధికార పక్షం అడ్డు తగులుతోందని మండిపడ్డారు. దుబ్బాక ఎన్నికలు సక్రమంగా జరగాలంటే సీపీని, ఇన్చార్జి మంత్రిని హరీశ్ రావును వెంటనే వెనక్కి పిలవాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు.