ఆ సీట్లపై కమలం ఫోకస్..కాంగ్రెస్-బీఆర్ఎస్‌లకు చెక్?

-

తెలంగాణపై బీజేపీ ఎక్కువ ఫోకస్ చేసిన విషయం తెలిసిందే. ఇక్కడ కాషాయ జెండా ఎగరవేయాలని గట్టిగా ప్రయత్నిస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో బి‌జే‌పి పుంజుకుంటుంది..ఇంకా బలపడి..అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీకి చెక్ పెట్టి అధికారంలోకి రావాలని బి‌జే‌పి చూస్తుంది. అయితే తాజాగా ఉన్న పరిస్తితులని చూస్తే..బి‌జే‌పికి గెలిచే బలం రాలేదనే చెప్పాలి. అధికారంలోకి రావాలంటే 60 సీట్లు రావాలి..కానీ బి‌జే‌పికి 30 సీట్ల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని సర్వేలు చెబుతున్నాయి.

అయితే ఇంకా బలం పెంచుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఈ క్రమంలోనే బి‌జే‌పికి ఏ మాత్రం పట్టు లేని ఎస్సీ, ఎస్టీ స్థానాలపై ఫోకస్ పెట్టింది..తెలంగాణలో 20 వరకు ఎస్టీ, ఎస్సీ స్థానాలు ఉన్నాయి. ఈ స్థానాల్లో సత్తా చాటాలని బి‌జే‌పి ప్లాన్ చేసింది. వాస్తవానికి ఈ స్థానాల్లో కాంగ్రెస్, కమ్యూనిస్టులు, బి‌ఎస్‌పి, బి‌ఆర్‌ఎస్ పార్టీలకు బలం ఉంది. గత ఎన్నికల్లో కాంగ్రెస్, బి‌ఆర్‌ఎస్ పార్టీలు ఎక్కువ సీట్లు గెలుచుకున్నాయి. ఈ సారి కూడా ఆ స్థానాల్లో రెండు పార్టీలు గట్టిగా పోటీ పడే ఛాన్స్ ఉంది.

ఏ మాత్రం బి‌జే‌పికి ఛాన్స్ దొరకపోవచ్చు. కానీ ఛాన్స్ తీసుకోవాలని బి‌జే‌పి చూస్తుంది. ఆ స్థానాల్లో కొందరు కీలక నేతలని బి‌జే‌పిలోకి చేర్చుకోవాలని చూస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా బి‌జే‌పి ఎస్సీ, ఎస్టీ నేతలతో సమావేశమైంది. రాష్ట్ర సహ ఇంచార్జ్ అరవింద్ మీనన్..బి‌జే‌పి నేతలతో సమావేశమయ్యారు. రిజర్వడ్  స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

అయితే రిజర్వడ్ స్థానాల్లో గెలిచే అవకాశం బి‌జే‌పికి చాలా తక్కువ ఉంది. ఆ స్థానాల్లోనే ఓటర్లు బి‌జే‌పిని ఆదరించడం కష్టమే. కాకపోతే ఆదిలాబాద్ లాంటి జిల్లాలో సత్తా చాటవచ్చు గాని..వరంగల్, ఖమ్మంలాంటి జిల్లాలో సత్తా చాటడం కష్టమే.

Read more RELATED
Recommended to you

Exit mobile version