జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకోవడం జరిగింది. భవిష్యత్తులో రెండు తెలుగు రాష్ట్రాలలో రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని పవన్ కళ్యాణ్ స్పష్టం చేయడం జరిగింది. ఇదిలా ఉండగా ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న జగన్ అసెంబ్లీలో శాసన మండలి రద్దు బిల్లును ఆమోదించి బిల్లును పార్లమెంటుకు పంపడం జరిగింది.
దీంతో జగన్ బీజేపీ పార్టీల మధ్య ఈ బిల్లు విషయమై ఒప్పందం కుదుర్చుకున్నట్లు జాతీయ మీడియాలో వార్తలు వినపడుతున్నాయి. మేటర్ ఏమిటంటే ఇటీవల కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకున్న బీజేపీ పార్టీకి పార్లమెంట్లో బలం అవసరం. ఈ నేపథ్యంలో శాసన మండలి రద్దు బిల్లుకు బీజేపీ ఆమోదం తెలిపి తాము పార్లమెంటులో తీసుకు వచ్చే బిల్లులకు వైసిపి పార్టీ సపోర్ట్ చెయ్యాలనే ఒప్పందం రెండు పార్టీల మధ్య కుదిరినట్లు వార్తలు గట్టిగా వినబడుతున్నాయి.
దీంతో అమరావతి విషయంలో ముందు నుండి ఒక రాజధాని ఉండాలి అంటూ కోరుకుంటున్న పవన్ కళ్యాణ్ ఈ విషయం తెలుసుకొని బిజెపి పార్టీ వ్యవహరిస్తున్న తీరుపై మండిపడుతున్నారట. అయితే ఇదే సందర్భంలో జనసేన పార్టీ కనీసం ఒక పార్లమెంట్ కూడా లేకపోవడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఒక ఎమ్మెల్యే కూడా కాకపోవడంతో …ఎన్నికలలో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోవడంతో పూర్తిగా పవన్ కళ్యాణ్ కి హ్యాండ్ ఇచ్చి…జగన్ తో రాబోయే రోజుల్లో అడుగులు వేయటం కోసం రెడీ అవుతున్నట్లు జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి.