ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల సమయంలో ప్రతిపక్షంలో ఉన్న వైయస్ జగన్ సరిగ్గా మొట్టమొదటి ఎన్నికల ప్రచార సభ కాకినాడలో నిర్వహించడం జరిగింది. ఆ సందర్భంలో వైయస్ జగన్ బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డి హత్య చేయబడటం రెండు తెలుగు రాష్ట్రాలలో సంచలనం సృష్టించింది. దీంతో ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండటంతో కావాలని వైయస్ జగన్ సానుభూతి రాజకీయాలు చేయడం కోసం తన బాబాయ్ వైయస్ వివేకానంద రెడ్డిని చంపించడం జరిగిందని ఆరోపించడం జరిగింది.
ఇదే సందర్భంలో వైసిపి పార్టీ నేతలు వైయస్ వివేకానంద రెడ్డి బతికి ఉంటే కడప జిల్లాలో టిడిపి కనుమరుగవుతుందని భావించి కావాలని తెలుగుదేశం పార్టీ నేతలు కడప జిల్లాకు చెందిన టీడీపీ మంత్రులు వైయస్ వివేకానంద రెడ్డిని చంపించారని ఆరోపించారు.
అయితే చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే ఈ కేసును సిట్ కి అప్పగించడం జరిగింది. అయితే ఆ తర్వాత జగన్ ఎన్నికల్లో గెలవడం జరిగింది. దీంతో ఇప్పటి వరకు సిట్ విచారణ నత్తనడకన సాగుతున్న తరుణంలో…వైయస్ వివేకానంద రెడ్డి కూతురు కేసును సిబిఐకి అప్పగించాలని హైకోర్టులో పిటిషన్ వేయటంతో జగన్ కి ట్విస్ట్ ఇచ్చినట్లయింది.