తెలంగాణలో రాబోయేది బిజెపి సర్కారే – లక్ష్మణ్

-

నేడు రాష్ట్రవ్యాప్తంగా వాజ్పేయి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు కమలనాధులు. ఈ మేరకు తెలంగాణ బిజెపి రాష్ట్ర కార్యాలయంలో వాజ్పేయి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. వాజ్పేయి జయంతిని గుడ్ గవర్నెన్స్ డే గా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా కమలనాధులు పార్టీ కార్యాలయంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు ఎంపీ లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి, మాజీ ఎమ్మెల్యే చింతల తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా బిజెపి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మాట్లాడుతూ.. తెలంగాణలో రాబోయేది బిజెపి సర్కారీ అని అన్నారు. దేశంలో రెండుసార్లు అధికారంలోకి వచ్చామంటే అది వాజపేయి నేర్పిన సిద్ధాంతాలేనన్నారు లక్ష్మణ్. వాజ్పేయి విలువలతో కూడిన రాజకీయాలు చేశారని అన్నారు. ప్రధాని మోదీ కూడా ఆయన స్ఫూర్తితోనే పనిచేస్తున్నారని.. కానీ కొందరు కులం పేరుతో, ప్రాంతం పేరుతో రాజకీయాలు చేస్తున్నారని, వీటిని ప్రజలు గమనించాలని సూచించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version