హీరో బాలాజీ గుర్తున్నాడా..ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే..?

-

సినిమా ప్రపంచం అంటేనే ఎన్నో వింతలు, విశేషాలు.. కొందరు జీవితంలో పైకి వస్తే మరికొంతమంది చితికి పోతారు. ఇంకొంతమంది మధ్యలోనే ఇండస్ట్రీ నుంచి నిష్క్రమిస్తారు. ఒకప్పుడు బాలనటిగా.. హీరోయిన్గా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేసిన రోహిణి తాజాగా బాహుబలిలో ప్రభాస్ పెంపుడు తల్లిగా కొండ జాతి మహిళగా మెప్పించింది. అయితే ఆమె నటించిన భక్త ప్రహల్లాద , యశోద కృష్ణ వంటి సినిమాలకు పిల్లాడిలా వెంట వెళ్లేవాడు ఆమె తమ్ముడు బాలాజీ. కానీ సినిమాలలో ఆక్ట్ చేయడం మొదలు పెట్టాక మాత్రం ఏ రోజు కూడా రోహిణి తన సోదరిగా ఆయన చెప్పుకోలేదు.

ఇంతకు బాలాజీ ఇప్పుడు ఏం చేస్తున్నాడు అంటే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టిన ఈయన మేనరిజం చూసి రజనీకాంత్ కూడా .. అచ్చం నన్నే ఇమిటేట్ చేస్తున్నావే అనే వాడట. బాలాజీ స్టైల్ చూస్తే జూనియర్ రజినీకాంత్ అనుకోవడం సహజమే.

బాలాజీ సొంతూరు టూరిపోగడవారి జిల్లా తాపేశ్వరం. స్టడీస్ అంతా నెల్లూరులోనే పూర్తి చేశాడు. కాలేజీలో ఉండగానే నాటకాల్లో వేసేవాడు. నెల్లూరులోని మెగా బ్రదర్ నాగబాబు కూడా డిగ్రీ బి.ఎ చదివాడు. కాలేజీలు వేరైనా వీరిద్దరికి మంచి పరిచయం ఉంది. నాగబాబు ఇంటి పక్కనే బాలాజీ ఇల్లు కూడా ఉండేది.

నాటకాలు వేసినప్పుడు తొలి బహుమతి చిరంజీవి ద్వారా అందుకున్నాడు. జంద్యాల డైరెక్షన్లో వచ్చిన నాలుగు స్తంభాలాటలో ఒక చిన్న వేషం వేసిన బాలాజీకి దర్శకరత్న దాసరి నారాయణరావు తీసిన ఓ ఆడది ఓ మగాడు సినిమాలో సాఫ్ట్ విలన్ క్యారెక్టర్ ఇవ్వడంలో అసలు కెరియర్ మొదలయింది. అలా ఎన్నో చిత్రాలను చేసి మెప్పించిన ఈయన నిర్మాతగా కూడా మెప్పించాడు. ప్రస్తుతం తెలుగు సీరియల్స్ లో ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్రలలో నటిస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Exit mobile version