హుజురాబాద్‌ : ఏడో రౌండ్‌లోనూ దూసుకెళ్లిన ఈటల రాజేందర్‌

-

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నిక కౌంటింగ్‌ చాలా రస వత్తరంగా కొనసాగుతోంది. పోస్టల్‌ బ్యాలెట్‌ మినహా… అన్ని రౌండ్లల్లోనూ… అధికార టీఆర్‌ఎస్‌ పార్టీకి… ఎదురు దెబ్బ తగిలింది. ఇక తాజాగా ఏడో రౌండ్‌ ఫలితాలు కూడా కాసేపటి క్రితమే… వెలువడ్డాయి. అయితే.. ఈ ఏడో రౌండ్‌ ఫలితాల్లోనూ… భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ లీడ్‌ లోకి వచ్చారు.

ఏడో రౌండ్ లో భారతీయ జనతా పార్టీకి 4044 ఓట్లు పోల్‌ కాగా.. టీఆర్‌ఎస్‌ పార్టీకి… 3792 పోల్‌ అయ్యాయి. దీంతో మొత్తం 3442 ఓట్ల లీడ్‌ ను సంపాదించారు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌. ఇక ఇప్పటి వరకు బీజేపీ పార్టీకి 31,027 పోల్‌ కాగా… టీఆర్‌ఎస్‌ పార్టీకి.. 27,589 ఓట్లు పోల్‌ అయ్యాయి. అటు కాంగ్రెస్‌ పార్టీకి 1086 ఓట్లు పోల్‌ అయ్యాయి. టీఆర్‌ఎస్‌ పార్టీ బలంగా ఉన్న వీణవంక మండలానికి సంబంధించిన ఓట్ల కౌంటింగ్‌ జరుగుతోంది. అయితే.. ఇక్కడ కూడా బీజేపీకే ఓట్లు ఎక్కువగా పడటం గమనార్హం.

Read more RELATED
Recommended to you

Exit mobile version