Bigg Boss Telugu 5: బిగ్ బాస్ తెలుగు సీజన్ 5 బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన షో. ఇప్పటి వరకూ 60 రోజులు విజయవంతంగా పూర్తి చేసుకుంది. షో ప్రారంభం నుండే టాప్ టీఆర్పి రేటింగ్ తో దూసుకపోతుంది. ఇక ఈ షోలో వారం వారం అత్యంత ఉత్కంఠగా జరిగే.. ‘బిగ్‌బాస్’.. ఎలిమినేషన్ ప్రక్రియ రసవత్తరంగా సాగింది. ఒకరి ముఖంపై ఒకరు ఫోమ్ ని పూసి మరీ ఓపెన్ నామినేషన్స్ చేయాలని
బిగ్ బాస్ ఫిటింగ్ పెట్టారు.
ఇందులో భాగంగా.. ఒక్కో కంటెస్టెంట్ ఇద్దరిద్దర్ని నామినేట్ చేస్తూ అందుకు గల కారణాలను తెలియజేయాలని చెప్పారు. అయితే.. షణ్ముఖ్ ఇంటి కెప్టెన్ కావడంతో.. అతన్ని నామినేట్ చేయడానికి వీళ్లేదని చెప్పడంతో షన్ను సేఫ్. ఈ వారం నామినేషన్ల పర్వంలో బిగ్ బాస్ హౌస్ లో 11 మంది కంటెస్టెంట్స్ ఉండగా.. వారిలో 10 మంది నామినేట్ అయ్యారు.
ఎవరెవర్ని నామినేట్ చేశారంటే!!
1. మానస్.. శ్రీరామ్, జెస్సీలను నామినేట్ చేశాడు.
2. సిరి.. సన్నీ, ఆనీ మాస్టర్లను నామినేట్ చేసింది.
3. శ్రీరామ్.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు.
4. రవి.. మానస్, కాజల్‌లను నామినేట్ చేశాడు.
5. జెస్సీ.. సన్నీ, మానస్‌లను నామినేట్ చేశాడు.
6. ప్రియాంక.. విశ్వ, రవిలను నామినేట్ చేసింది.
7. సన్నీ.. సిరి, జెస్సీలను నామినేట్ చేశాడు.
8. విశ్వ.. ప్రియాంక, మానస్‌లను నామినేట్ చేశాడు.
9. కాజల్.. రవి, శ్రీరామ చంద్రలను నామినేట్ చేసింది.
10. ఆనీ మాస్టర్.. సిరి, కాజల్‌లను నామినేట్ చేసింది.
11. షణ్ముఖ్.. మానస్, ప్రియాంకలను నామినేట్ చేశాడు.
ఇలా 9వ వారం నామినేషన్స్‌లో.. సిరి, కాజల్, ప్రియాంక, మానస్, సన్నీ, జెస్సీ, ఆనీ మాస్టర్, శ్రీరామ్, రవి, విశ్వ నామినేషన్లో నిలిచారు. షణ్ముఖ్ కెప్టెన్ కావడంతో.. ఎలిమినేషన్ నుంచి తప్పుకున్నారనే చెప్పాలి. నామినేషన్ల అనంతరం.. శ్రీరామ్, మానస్‌కి మధ్య వాడీ వేడి చర్చ జరిగింది.