బిజెపి దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసింది – రేవంత్ రెడ్డి

-

భారతీయ కరెన్సీ రోజురోజుకు బలహీనపడటంపై పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. డాలర్ తో పోల్చితే రూపాయి పతనాన్ని అరికట్టడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టిందో చెప్పాలన్నారు. గతంలో రూపాయి 69కి పడిపోయినప్పుడు గుజరాత్ సీఎం గా ఉన్న మోదీ.. రూపాయి ఐసీయూలో పడిపోయిందన్నారని.. కానీ ఇప్పుడు రూపాయి విలువ 82ను దాటిపోయిందన్నారు.

రూపాయి పతనంతో సామాన్యులపై ఆ ప్రభావం పడుతోందని ఉన్నారు. ధరలు పెరిగి సామాన్యులపై భారం పడుతోందని.. రోజురోజుకు రూపాయి విలువ పడిపోతున్నా మోదీ ప్రభుత్వం చోద్యం చూస్తోందని మండిపడ్డారు. స్వాతంత్య్రం తరువాత నుంచి 2014 వరకు కేంద్రంలో ఉన్న ప్రభుత్వాలు చేసిన అప్పు రూ.55,87,149 కోట్ల రూపాయలు మాత్రమేనని. కానీ.. 2014 నుంచి 2022 వరకు మోదీ ప్రభుత్వం రూ.80,00,744 కోట్ల అప్పు చేసిందన్నారు. 67 ఏళ్లలో పాలించిన ప్రభుత్వాలన్నీ కలిపి చేసిన అప్పులకంటే.. మోదీ ప్రభుత్వం చేసిన అప్పులే ఎక్కువన్నారు రేవంత్ రెడ్డి. బీజేపీ ప్రభుత్వం దేశాన్ని అప్పుల కుప్పగా మార్చేసిందన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version