త్వరలో దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలతో పాటుగా లోక్ సభ ఎన్నికల్లో గెలుపే ప్రధాన లక్ష్యంగా బీజేపీ అధిష్టానం వర్క్ చేయనుంది. ఇందుకోసం ఈ రోజు ఢిల్లీలో కీలక నేతలతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. ఈ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాలలో అభ్యర్థుల ఎంపిక, పార్టీ వ్యూహాలు, ఎన్నకల బాధ్యతలు లాంటి వివిధ అంశాలపై చర్చించుకున్నట్లు సమాచారం. ఈ చర్చలు రెండు రోజుల పాటు జరగనున్నాయి. ఈ సమావేశంలో హోమ్ మిస్టర్ అమిత్ షా, బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా, ఆర్గనైజెషనల్ సెక్రెటరీ బి ఎల్ సంతోష్, జనరల్ సెక్రటరీ సునీల్ బన్సాల్ మరియు ఉపాధ్యక్షుడు సౌధాన్ సింగ్ లు పాల్గొన్నారు. ఇక ఈ సమావేశంలో పార్టీలో ఖాళీగా ఉన్న పదవులను భర్తీ చేయడానికి కూడా చర్చలు చేయనున్నారట.