దళిత వ్యతిరేక పార్టీ బీజేపీయే అని తెలంగాణ రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఎంతో మంది దళితుల ప్రాణాలను తీసిన చరిత్ర బీజేపీకే ఉందని విమర్శించారు. దళితుల సంక్షేమం కోసం తమ పార్టీ అనేక పథకాలను ప్రవేశ పెట్టిందని అన్నారు. దళిత బందు పథకాన్ని దేశం మొత్తం అమలు చేసే దమ్ము బీజేపీకి ఉందా అని ప్రశ్నించారు. అలాగే రాష్ట్రంలో 175 అడుగుల ఎత్తులో విగ్రహం నిర్మించబోతున్నామని అన్నారు. అలాగే దళిత భవన్ ను కూడా దసరా నాటికి పూర్తి అవుతుందని అన్నారు.
అలాగే ఈ రోజు బండి సంజయ్ మాటలను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. బండి సంజయ్ మాటలను తెలంగాణ ప్రజలు ఎవరూ కూడా నమ్మరని అన్నారు. రాష్ట్రం నుంచి బీజేపీని తరమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని అన్నారు. అలాగే దళితుల గురించి మాట్లాడే నైతిక హక్కు బీజేపీకి లేదని అన్నారు. బీజేపీ ఆర్ఎస్ఎస్ సంస్థ విధానాలే దళితులకు వ్యతిరేకంగా ఉంటాయని విమర్శించారు. బడ్జెట్ లో రాష్ట్ర అభివృద్ధికి బీజేపీ ఎం ఇచ్చిందని అన్నారు. బండి సంజయ్ రాష్ట్రానికి ఏం తీసుకువచ్చారని ప్రశ్నించారు. ఒక్క మెడికల్ కాలేజీ కూడా తీసుకురాని బీజేపీ నాయకులను రాష్ట్రం నుంచి తరమి కొట్టాలని అన్నారు.