రేపటి నుండి బీజేపీ ‘మైక్రో డొనేషన్స్’ షురూ కానుంది. ఈ కార్యక్రమాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ప్రజల నుండి ‘మైక్రో డొనేషన్స్’ పేరిట చిన్న మొత్తాలను విరాళాలుగా సేకరించాలని భారతీయ జనతా పార్టీ నిర్ణయించింది. అందులో భాగంగా రేపు ఉదయం 11 గంటలకు పార్టీ రాష్ట్ర కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ ‘మైక్రో డొనేషన్స్’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు.
విరాళాలను ఫిబ్రవరి 11 వరకు సేకరించాలని నిర్ణయించారు. ‘మైక్రో డొనేషన్స్’ బాధ్యతను మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పార్టీ రాష్ట్ర కోశాధికారి భండారి శాంతికుమార్, రాష్ట్ర మాజీ కార్యదర్శి పాపారావులకు అప్పగించారు. కేవలం చిన్న మొత్తాలను మాత్రమే విరాళాలుగా స్వీకరిస్తారు. అంటే రూ. 5 నుండి మొదలుకుని రూ.50, రూ.100, రూ.500, రూ.వెయ్యి వరకు మాత్రమే విరాళాలుగా స్వీకరిస్తారు. ఒక వ్యక్తి ఒకసారి మాత్రమే విరాళం ఇవ్వాలి. రెండోసారి ఇవ్వాలనుకున్నా అది సాధ్య పడదు. విరాళాలు ఇవ్వదల్చుకున్న వారు తప్పనిసరిగా ‘NAMO APP’ ద్వారానే చెల్లించాలి