చిత్ర పరిశ్రమలో మరో విషాదం..స్టార్‌ నటి గుండెపోటుతో మృతి

-

చిత్ర పరిశ్రమను వరుస విషాదాలు వెంటాడుతూనే ఉన్నాయి. 2020 నుంచి ఇప్పటికే వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు ఇలా చాలా మంది మరణించారు. కరోనా మహమ్మారి కారణంగా కొంత మంది మరణిస్తే.. మరికొంత మంది వ్యక్తిగత కారణాల వల్ల మరణించారు. ఇక తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం…చోటు చేసుకుంది.

తాజాగా నటి సోనాలి ఫోగట్ తుది శ్వాస విడిచారు. గోవాలో ఆమెకు తీవ్ర గుండెపోటు రావడంతో మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. తాజాగా సోనాలి తన సిబ్బందితో కలిసి గోవా వెళ్లారు. అయితే.. నిన్న అర్థరాత్రి గుండె పోటు రావడంతో మరణించారు.

దీంతో ఆమె కుటుంబంలో విషాదంలోకి వెళ్లింది. కాగా… సోనాలి ఫోగట్ బిజెపి నాయకురాలు. ఆమె 2019 హర్యానా ఎన్నికల్లో బీజేపీ టిక్కెట్‌పై అడంపూర్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేశారు. ఇటీవలే కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలోకి మారిన కుల్దీప్ బిష్ణోయ్‌పై ఆమె పోటీ చేశారు. టిక్‌టాక్‌లో కూడా సోనాలి బాగా పాపులర్ అయింది. సోనాలి ఫోగట్ చివరి సారిగా బిగ్ బాస్ 14లో కనిపించింది. ఇక సోనాలి మృతి పట్ల పలువురు సంతాపం తెలుపుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version