రౌతు భరోసా పైసలు కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా : ఏలేటి మహేశ్వర్ రెడ్డి

-

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిపోయింది. అయినా ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. కనీసం కొత్త సంవత్సరం అయినా గుర్తు తెచ్చుకుని నెరవేర్చాలి. ఏడాది పాటు ప్రజలను ఇబ్బందులు పెట్టి కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చడంలేదు. ఈ దుర్మార్గాలను ఇకనైనా వీడి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చండి. సర్కార్ ప్రజాస్వామ్య పద్ధతిని వీడాలని ప్రజలు కోరుకుంటున్నారు. గత ఖరీఫ్ లో రైతు భరోసా ఇవ్వలేదు.. ఇప్పుడు రబీ సీజన్ లో అయినా ఇస్తారా.. మాయమాటలతో మోసం చేయడం తప్పా.

అయితే వారికి మంచి చేసే ఆలోచన కాంగ్రెస్ కు ఉందా? ఉప ముఖ్యమంత్రి భట్టి స్వయంగా రైతు కూలీలకు ఏడాదికి 12 వేలు ఇస్తామని మాట ఇచ్చారు.. ఆ మాట ఇచ్చి డిసెంబర్ 28తోనే ఏడాది దాటిపోయింది.. వారికి ఇవ్వకుండా ఆయన్ను అడ్డుకునేది ఎవరు.. లేదా ఆ డబ్బులు మరెవరికైనా కాంట్రాక్టర్లకు ఇచ్చేందుకు దాచారా? రైతు భరోసాపై కమిటీ ఏర్పాటు చేసి 15 రోజుల్లో నివేదిక ఇస్తామన్నారు.. ఈ కమిటీ ఏర్పడి 4, 5 నెలలు దాటింది. అయినా దానికి సంబంధించిన విధివిధానాలు ఎందుకు ఇవ్వలేకపోయారు. 4వ తేదీన జరిగే కేబినెట్ భేటీలో రైతు భరోసాపై చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఎప్పటిలోగా ఇస్తారో తేదీ కూడా అదే రోజు ప్రకటించాలి. 15 వేల చొప్పున ఇవ్వాలంటే ఒక్క సీజన్ కు 23 వేల కోట్లు చెల్లించాల్సి ఉంది.. రెండు సీజన్లకు కలిపి 46 వేల కోట్లు బకాయి ఉంది. కానీ సర్కార్ బడ్జెట్ లో 15 వేల కోట్లు మాత్రమె కేటాయించింది. మిగిలినవి ఎలా ఇస్తారో కాంగ్రెస్ సర్కార్ సమాధానం చెప్పాలి అని మహేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news