వైసీపీ అధ్యక్షుడు వైస్ జలగం పై బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు సోమ వీర్రాజు ఫైర్ అయ్యారు. అనవసర విమర్శలు మారి రాష్ట్ర అభివృద్ధి కోసం జగన్ మోహన్ రెడ్డి మెచ్యూర్డ్ రాజకీయాలు చేయాలి. గత వైసీపీ ప్రభుత్వం మూలంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది.
కూటమి ప్రభుత్వం రాష్ట్రాన్ని గాడిలోకి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అనంతరం అన్ని పథకాలను అమలు చేస్తారు. అన్ని నొక్కి కూడా వైసిపికి ఏపీలో 11 సీట్లు ఎందుకు వచ్చాయి, అన్నీ చేసి కూడా చీపురుకట్ట ఢిల్లీలో ఎందుకు ఓడిపోయింది. జగన్మోహన్ రెడ్డి పొంతన లేని మాటలు మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ అంటున్నాడు, 2019లో రాష్ట్ర ప్రజలు 62 సీట్లు ఇచ్చిన కూడా అసెంబ్లీకి వెళ్లలేదు. ఇప్పుడు క్యాబినెట్ హోదా ఇస్తే అసెంబ్లీకి వెళ్తానంటున్నావు, 11 సీట్లు వచ్చిన నీకు క్యాబినెట్ హోదా ఎలా ఇస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, కూటమి ప్రభుత్వంపై జగన్ అనవసర విమర్శలు మానుకొని రాష్ట్ర అభివృద్ధికి ప్రభుత్వంతో కలిసి పని చేయాలి అని సోము వీర్రాజు అన్నారు.