మిర్చి ధరల తగ్గుదలపై సీఎం చంద్రబాబు ఫోకస్..!

-

మిర్చి ధరల తగ్గుదలపై సుదీర్ఘంగా సమాచారం సేకరించారు సీఎం చంద్రబాబు.. గుంటూరు మిర్చి యార్డులో,లారీ యూనియన్ సమస్యలు, కాటా కూలీల సమస్యలు, ధరలు తగ్గిన నేపథ్యంలో రైతులకు ఎలా న్యాయం చేయాలి అన్న విషయాలను, అడిగి తెలుసుకున్న సీఎం.. ఈ క్రాప్ లో నమోదైన మిర్చి రైతులకు, కౌలు రైతులకు, ఆర్థిక సాయం అందించేందుకు సుముఖత వ్యక్తం చేసారు. ఎకరానికి ఎంత ఆర్థిక సాయం చేయాలనేది, త్వరలోనే విధివిధానాలు ఖరారు చేస్తామని చెప్పిన సీఎం.. రైతుల సమస్యలను కూడా ప్రత్యేకంగా ,అడిగి తెలుసుకున్నారు.

ఎకరానికి ఎంత ఖర్చవుతుంది, విత్తనాల సబ్సిడీ,ఎంత వస్తుంది, పురుగుల మందుల రేట్లు, కూలి రేట్లు తదితర వివరాలను రైతుల నుండి, అడిగి తెలుసుకున్న సీఎం… మిర్చిని ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా, ఏపీ రైతులకు ప్రయోజనం ఉండదని, ఏపీ రైతులకు నేరుగా వాళ్ళ అకౌంట్లోనే డబ్బులు జమ చేసే విధంగా అమలు చేస్తాం. ఇంటిగ్రేటెడ్ ఖాటా ల ద్వారా , మిర్చి తూకాలు వేస్తే, ఏకకాలంలో రైతుకి, ఏజెంట్ కి, వ్యాపారికి, ఎగుమతి దారుడికి మిర్చి తూకం వివరాలు, ధరల వివరాలు వచ్చేలా, చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మిర్చి రకాన్ని బట్టి, ఒక్కొక్క రకం ఎంత ధర అమ్ముతుంది అధికారులను అడిగి వివరాలు సేకరించి సీఎం.. ఇప్పటికే కోల్డ్ స్టోరేజీలో నిల్వచేసుకున్న రైతులకు, బ్యాంకుల ద్వారా రుణాలు అందించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version