బీసీ నేతల సమావేశంలో కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వివాదం..!

-

బీసీ నేతల సమావేశంలో VH… అంజన్ కుమార్ యాదవ్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. అయితే VH తన ప్రసంగంలో యాదవుల ప్రస్తావన చేయలేదని అంజన్ అభ్యంతరం వ్యక్తం చేసారు. ఉద్దేశపూర్వకంగా మమ్మల్ని తొక్కేస్తున్నావు అని అంజన్ పేర్కొన్నారు. అయితే నిన్ను రాజకీయాల్లోకి తెచ్చింది నేనే కాదా అన్న VH.. అయినా పార్టీ యాదవులకు ఏం తక్కువ చేసింది అని ప్రశ్నించారు.

మీ ఇంట్లో అనిల్ కి ఎంపీ పదవి ఇచ్చింది.. నీకు PCC వర్కింగ్ ప్రెసిడెంట్ ఉంది అన్నారు. అయితే నా కొడుక్కి యాదవ కోటాలో పదవి రాలేదు.. యూత్ కాంగ్రెస్ కోటాలో వచ్చిందన్నారు అంజన్. దాంతో మేం ఇంత కష్టపడుతున్న మాకేం వచ్చింది అని అడిగారు VH. అలా ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోరు చేసుకుంది. దీంతో మధ్యలో జోక్యం చేసుకున్నారు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్. కలిసి పని చేయాల్సింది పోయి ఇలా ఘర్షణ పడటం సరికాదన్నారు పొన్నం.

Read more RELATED
Recommended to you

Exit mobile version