సోనియా గాంధీని బలి దేవత అన్న రేవంత్ రెడ్డికి అదే సోనియా గాంధీ ఇప్పుడు బంగారు దేవత అయింది అంటూ బీజేపీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు. ఉద్యోగులకు 5 DAలు పెండింగ్ లో ఉన్నాయి. ఉద్యోగులు ఎందుకు ఓటు వేయాలి రేవంత్ రెడ్డి. రిటైర్ అయిన ఉద్యోగుల కు రావాల్సిన డబ్బులు కూడా ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు… వాళ్ళు చెప్పులు అరిగేలా తిరుగుతున్నారు.
రాహుల్ గాంధీ అశోక్ నగర్ కి వచ్చి ముక్కు నేలకు రాసి పట్టభద్రుల ఓట్లు అడగాలి. అరువు తెచ్చుకున్న అభ్యర్థినీ గెలిపిస్తే రేవంత్ రెడ్డి కి ఊడిగం చేస్తారు. బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తే మీ గొంతు అయ్యి ప్రశ్నిస్తారు. రేవంత్ రెడ్డి సర్వే కు ముడి పెట్టీ 42 శాతం రిజర్వేషన్ ల నుండి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. సర్వేకు 42 శాతం రిజర్వేషన్ లకి సంబంధం లేదు. శాస్త్రీయ సర్వే చేసింది బీహార్ లో బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం.. మీ అధికారులు వెళ్లి వచ్చింది అక్కడికే. కర్నాటక లో సర్వే చేశారు.. రిపోర్ట్ ఎందుకు బయట పెట్టలేదు. తెలంగాణలో సర్వే వివరాలు పూర్తిగా బయట పెట్టండి.. గ్రామాల వారికి చెప్పండి అని బీజేపీ ఎంపీ కోరారు.