టీటీడీ భూముల వ్యవహారంపై “కీలక నేత” స్పందించారహో!

-

జనాల జ్ఞాపకశక్తిపై కొందరు నేతలకు చాలా చులకనభావం ఉండటం రాజకీయాల్లో.. ఈ మధ్యకాలంలో మరీ ఫ్యాషన్ అయిపోయింది. మీడియా, సోషల్ మీడియా ఎంతో డెవలప్ అయ్యాయి… ప్రజలు మరింతగా డెవలప్ అయ్యారు… ప్రజలు అన్ని విషయాలూ తెలుసుకుంటున్నారు.. అన్ని విషయాలనూ పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో నిన్న మనం చేసిన పనికి, నేడు మనం మాట్లాడుతున్న మాటకీ ఉన్న వ్యత్యాసాలు జనం గ్రహించరులే అని మైకుల ముందు తెగ హడావిడి చేస్తున్నారు కొందరు నేతలు! ప్రస్తుతం అలాంటి రాజకీయ నిరుద్యోగులకు, ప్రజల తిరస్కారానికి గురైన నేతలకు పనికి ఆహారపథకంలా దొరికింది టీటీడీ భూముల అమ్మకం వ్యవహారం అనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

2014లో ఏర్పాటైన తెలుగుదేశం ప్రభుత్వంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా పదవీబాధ్యతలు చేపట్టి.. నాడు టీటీడీ భూముల అమ్మకాలపై అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్న మంత్రి మాణిక్యాల రావు తాజాగా మైకుల ముందుకు వచ్చారు! దేవాలయ భూములను దొడ్డిదారిన దోచేసి రెవెన్యూ అధికారులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోందని.. 39 జీవోలో తొమ్మిదో క్లాజును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇవన్నీ తమరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన వ్యవహారమే స్వామీ అని వైకాపా నేతలు చెవులు చిల్లులు పడేలా చెబుతున్నా… జనాలు ఏమనుకుంటారు అనే ఆలోచన లేకుండా ఇలా స్పందిస్తున్నారు మాజీ మంత్రి వర్యులు!

ఈ బీజేపీ నేత సంగతి అలా ఉంటే… తిరుమల శ్రీవారి భూములు కాపాడాలంటూ బీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్షినారాయణ గుంటూరులో తన నవాసంలో ఉపవాస దీక్ష చేప్టటారు. సోమవారం రాత్రి జీఏడీ ముఖ్యకార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ జీవో (జీవోఆర్‌టీ నెం.888) జారీ చేశారు. టీటీడీకి చెందిన 50 ఆస్తులను వేలం వేయాలని గత ప్రభుత్వం నియమించిన బోర్డు 2016 జనవరి 30వ తేదీన తీర్మానం చేసింద‌ని, దీనిని నిలిపివేస్తున్నామ‌ని, భక్తుల మనోభావాలను గౌరవిస్తూ… ఈ అంశాన్ని పునఃపరిశీలించాలని ఆదేశిస్తున్న‌ట్టు ఆ జీవోలో పేర్కొన్నారు! అయినా కూడా “తీరా అనుకున్నాం కదా కాసేపు దీక్ష చేసేస్తే పోతుందిలే” అనుకున్నారో ఏమో కానీ.. ప్రభుత్వం భూములు అమ్మకాలు నిలిపేసినట్లు జీవో ఇచ్చినా కూడా రాజకీయంగా పనికి ఆహారపథకాన్ని సృష్టించుకుంటున్నారు మాజీ నేతలు!!

Read more RELATED
Recommended to you

Exit mobile version