కేంద్ర బలగాలు దింపండి.. గవర్నర్ ని కోరిన బీజేపీ నేతలు

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో బీజేపీ నేతలు లక్ష్మణ్, రామ చందర్ రావ్, రామ చంద్రారెడ్డిలు గవర్నర్ ని కలిశారు. అనంతరం ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడు లక్ష్మణ్ మాట్లాడుతూ ఓటమి భయం తో శాంతి భద్రతల సమస్య పేరుతో, ఎన్నికల వాయిదా వేసేందుకు  అధికార పార్టీ కుట్ర చేస్తోంది.. వెంటనే కేంద్రం దృష్టికి తీసుకెళ్లి.. కేంద్ర బలగాలు డిప్లయ్ చేయాలని గవర్నర్ ని కోరామని అన్నారు.

హైదరాబాద్ లో అల్లర్లు జరగాలని టీఆరెస్ కోరుకుంటుందన్న ఆయన వైఫల్యాల నుండి ప్రజల దృష్టి మరల్చేందుకు ఎన్నికలు తప్పించుకునేందుకు ప్రయత్నం చేస్తోందని అన్నారు. శాంతి భద్రత ల సమస్య సృష్టించే వారిని వెంటనే అరెస్టు చేయాలని ఆయన కోరారు. బీజేపీ ప్రచారాన్ని చూసి ఎందుకు టీఆర్ఎస్, కేసీఆర్,కేటీఆర్ లు ఉలిక్కిపడుతున్నారని ఆయన ప్రశ్నించారు. మీరు గల్లికో మంత్రిని ఎమ్మెల్యేని పెట్టి ప్రచారం చేయడం లేదా ? అని అయన ప్రశ్నించారు. మీ ప్రచారానికి దావూద్ ఇబ్రహీం ని,బిన్ లాడెన్ పిలుచుకోండి అంటూ ఆయన ఎద్దేవా చేశారు. మా నేతలు ప్రచారానికి వస్తే మీకు నొప్పి ఏంది అంటూ ఆయన ప్రశ్నించారు. 

Read more RELATED
Recommended to you

Exit mobile version