జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ఊపు అందుకుంది. నేతలు ఒకరి పై ఒకరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేసుకుంటున్నారు. ఈ సారి ఎంఐఎం అధినేత అసదుద్దీన్ భాజపా పై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. చలికాలంలో కూడా ఘటైనా వాఖ్యలతో రాజకీయంగా వేడి పుట్టిస్తున్నారు. దీంతో బల్దియా ఫైట్ లా మారిపోయింది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలంటూ మజ్లీస్ అధినేత అసదుద్దీన్ ఒవైసీ విరుచుకుపడ్డారు. తాను మాట్లాడటం మొదలు పెడితే మరోలా ఉంటుందని వార్నింగ్ ఇచ్చాడు. ఈ సారి పోటీ హైదరాబాద్ వర్సెస్ భాగ్యనగర్ మధ్యే అంటూ కొత్త డైలాంగ్ పేల్చారు.
జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం వాడి వేడిగా జరుగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు ఈ ఎన్నికల పై ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు. మరో వైపు బీజేపీ దుబ్బాక ఎన్నికలను ఉధాహరణగా చూపిస్తూ రాజకీయం చూరకలు వేస్తున్నారు. టీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం పోటా పోటీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టారు. ఈ ఎన్నికలను ఒక సవాల్ గా స్వీకరించి అన్నీ పార్టీ వర్గాలు పని చేస్తున్నాయి. ఎన్నికల ఫలితాలు వస్తే కానీ, తెలియాదు. అసలు గెలుపు ఎవరిదో.