గవర్నర్ తమిళిసై ని కలిసిన బిజెపి మహిళా మోర్చా

-

ఇబ్రహీంపట్నం ప్రభుత్వాసుపత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వికటించి నలుగురు మృతి చెందిన ఘటన పై గవర్నర్ ని కలిశారు బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రభుత్వం తూతూమంత్రంగా విచారణ చేస్తే సరిపోదని అన్నారు. సరైన వసతులు లేవు… వాటి మధ్యే ఆపరేషన్లు నిర్వహించారని మండిపడ్డారు. డ్రగ్స్ లో తెలంగాణ నెంబర్ వన్ గా ఉంది… విమెన్ ట్రాఫికింగ్ లో నెంబర్ వన్ ఉంది… మహిళల పై దాడుల్లో నెంబర్ వన్ గా ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇబ్రహీంపట్నం ఘటన కి బాధ్యత వహిస్తూ.. హరీష్ రావు ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి. గురుకుల పాఠశాలలు అస్తవ్యస్తంగా ఉన్నాయని.. విద్యార్థినులు అవస్థలు పడుతున్నారని తెలిపారు. ఐఐటీలో స్టూడెంట్ చనిపోతే కూడా పట్టించుకోని విద్యా మంత్రి సబిత తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. “మహిళా ముఖ్యమంత్రి లేరని మేము కొట్లాడినామ్. అప్పుడే సత్యవతి రాథోడ్ కి మంత్రి పదవి ఇచ్చారు. అలాంటి మంత్రి… తెలంగాణ లో మహిళలపై దాడులు జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.

విద్యార్థినుల పై లైంగిక దాడులు జరుగుతున్నా.. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా.. కనీస పరామర్శ కూడా ఉండదు. సత్యవతి ని కూడా బర్తరఫ్ చేయాలి. ఇబ్రహీంపట్నం ఘటనపై న్యాయం జరిగేలా చూస్తామని గవర్నర్ హామీ ఇచ్చారు. చనిపోయిన కుటుంబాలకు కోటి రూపాయలు, డబుల్ బెడ్ రూమ్ ఇల్లు ఇవ్వాలి. పిల్లల చదువుకు అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరించాలి”. అని డిమాండ్ చేశారు బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు గీతా మూర్తి.

Read more RELATED
Recommended to you

Exit mobile version