రైతులు రోడ్ల మీదకు రావాలని కేటీఆర్ అంటున్నాడు. 2014 లో ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం అన్నారు మీరు. 2018 లో కూడా మోసం చేసింది మీరు. రైతులను ఇబ్బంది పెట్టింది మీరు. అందుకే మీకు 2023 లో కర్రు కాల్చి వాత పెట్టారు రైతులు అని ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. ఎవరు వ్యవసాయం చేస్తున్నారో వాళ్ళకే రైతు భరోసా అందాలి. బిజినెస్ మ్యాన్ లకు.. గుట్టలకు రైతు బంధు పడుతుంది.
గుట్ట నీ సాగుచేసినట్టు డబ్బులు అప్పనంగా ఇచ్చింది మీరు. 22 వేల కోట్లు మాజీ సిఎం.. కేటీఆర్ దోచి పెట్టారు. రేవంత్ రెడ్డి నాయకత్వం నిర్వీర్యం చేయాలనే BRS కుట్ర చేస్తుంది. అసెంబ్లీ లో కూడా బీసీ ఎంఎల్ఏ నీ ముందు పెట్టి… సభలో గందరగోళం చేశారు హరీష్. కాళేశ్వరం లో ఏం జరిగిందో..చర్చ చేద్దాం వస్తారా హరీష్.. కేసీఆర్. కరీంనగర్ లో రెస్ మిల్లులు కేసీఆర్ వాళ్లవే. వడ్ల కొనుగోలులో ఎక్కడైనా అన్యాయం జరిగిందో అడగాలి అని అడ్లూరి లక్ష్మణ్ పేర్కొన్నారు.