గోషామహల్ గుడుంబా కింగ్ రాజాసింగ్..దమ్ముంటే నాపై పోటీ చేయ్ – షకీల్

-

బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై.. బోధన్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే షకీల్ ఫైర్ అయ్యారు. తెలంగాణ అభివృద్ధి పై రాజాసింగ్ కి ఏమాత్రం అవగాహన లేదని.. గోషామహల్ గుడుంబా కింగ్ రాజాసింగ్ అని విమర్శలు చేశారు. దమ్ముంటే వచ్చే ఎన్నికల్లో నాపై పోటీ చేయ్.. ఎవరి సత్తా ఏంటో తెలుస్తుందని సవాల్‌ విసిరారు. ప్రపంచంలో వ్యవసాయాధారిత పరిశ్రమలపై జీఎస్టీ విధించిన ఘనత బీజేపీదేనని.. 2500 కోట్ల నిధులు ఖర్చు చేసి బోధన్ నియోజక వర్గాన్ని అభివృద్ధి చేశానని వెల్లడించారు.

దళితబంధు పథకంపై కుట్రలు చేస్తూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారని బీజేపీ నేతలపై మండిపడ్డారు. దళితబంధులో కమిషన్లు తీసుకుంటున్నారని అనడానికి సిగ్గుండాలి.. దళితబంధులో కమిషన్ తీసుకున్నట్లు నిరూపిస్తే ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తానని ఛాలెంజ్‌ చేశారు.

సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక మతాల పేరుతో కుట్రలు చేస్తున్నారు… యువకులను మతాల పేరుతో రెచ్చగొట్టి వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ఎంపీ అరవింద్ బోధన్ నియోజకవర్గంలో ఎక్కడైనా అభివృద్ధి కోసం 10 పైసలు ఖర్చు చేసినట్లు నిరూపిస్తే నా ఎమ్యెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. బోధన్ నియోజకవర్గంలో ఏ గ్రామం ఎక్కడ ఉందో తెలియని వ్యక్తి ఎంపీ అరవింద్ అని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version