దేశానికి మోడీ వరమైతే, కేసీఆర్ తెలంగాణకు శాపం : అరవింద్

-

టీఆర్‌ఎస్‌ సర్కార్‌ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి ఫైర్‌ అయ్యారు. తెలంగాణలో రైతు పరిస్థితి ఆగం అయిపోయిందన్నారు. ప్రజలు, రైతులు తిరగబడే రోజు తెలంగాణ లో దగ్గరలోనే ఉందని… దేశానికి మోడీ వరం అయితే, కేసీఆర్ తెలంగాణ కు శాపంగా మారాడని నిప్పులు చెరిగారు. బిజెపి,టీఆర్ఎస్ రాజకీయంగా కొట్టుకుంటుంటే…. కాంగ్రెస్ నేతలు గాంధీభవన్‌లో, ఢిల్లీ వార్ రూం లో తమలో తాము కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు.

పంటలు అన్ని కాకుండా కేవలం వరి పంట వేయాలని రైతులను కేసీఆర్ కోరారని… మార్క్ ఫెడ్ సంస్థ ను కేసీఆర్ నిర్వీర్యం చేసారని మండిపడ్డారు. మొక్కజొన్న కొనుగోలు మార్క్ ఫెడ్ సంస్థ కాకుండా దళారీలు కొనుగోలు చేసే పరిస్థితులు కల్పించారన్నారు. తెలంగాణ లో 7 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న సాగు అవుతుందని… రైతులు కేసీఆర్ కుటుంబ ప్రమేయం ఉన్న దళారుల చేతుల్లో మోసపోతున్నారని నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వం, రైతుల నుంచి వరి ధాన్యం సేకరణ చేసిన దానికి సకాలంలో డబ్బులు చెల్లించడం లేదని.. రైతుల అయోమయ పరిస్థతికి కారణం కేసీఆర్ . ఎటువంటి దిక్కుతోచని పరిస్థితుల్లోకి రైతులను నెట్టి వేసారని మండిపడ్డారు. రైతుల నుంచి వరిధాన్యం సేకరణ సకాలంలో జరగడం లేదు. డబ్బులు చెల్లింపులు ఆలస్యం అవుతున్న దానిని ప్రశ్నించినందుకు బండి సంజయ్ పై రాళ్ల దాడి చేసారని ఆగ్రహించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version