ఎం‌ఐ‌ఎంకు మళ్ళీ 7 ఫిక్స్? కమలం ఆపగలదా?

-

తెలంగాణలో టీఆర్ఎస్‌ని కట్టడి చేయాలని చూస్తున్న బీజేపీ…ఎం‌ఐ‌ఎంపై ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కేసీఆర్‌ని గద్దె దించి అధికారంలోకి రావాలని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్న విషయం తెలిసిందే. బీజేపీ అధికారంలోకి రావాలంటే టీఆర్ఎస్‌కు చెక్ పెట్టడమే కాదు…ఎం‌ఐ‌ఎంకు కూడా చెక్ పెట్టాలి. ఎందుకంటే ఎం‌ఐ‌ఎంకు తెలంగాణలో 7 సీట్ల బలం ఉంది…అలాగే కొన్ని సీట్లలో గెలుపోటములని ప్రభావితం చేయగల సత్తా ఎం‌ఐ‌ఎంకు ఉంది.

 

ఒకవేళ ఎం‌ఐ‌ఎం గాని టీఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకుంటే బీజేపీ గెలవడానికి కష్టమవుతుంది. అందుకే ఎం‌ఐ‌ఎంని కట్టడి చేయాల్సిన అవసరం బీజేపీకి ఉంది. అయితే సిట్టింగ్ సీట్లలో ఎం‌ఐ‌ఎంని నిలువరించడం బీజేపీకి కాస్త సాధ్యమయ్యే పని కాదని చెప్పొచ్చు. ఎందుకంటే ఎం‌ఐ‌ఎం సీట్లలో వేరే పార్టీ గెలవడం కష్టం. ఇప్పుడు ఎం‌ఐ‌ఎం చేతిలో 7 సీట్లు ఉన్నాయి. అది హైదరాబాద్‌లోని నాంపల్లి, కార్వాన్, ఛార్మినార్, చాంద్రాయణగుట్ట, యాకుత్‌పురా, బహదూర్‌పురా, మలక్‌పేట్ స్థానాలు ఎం‌ఐ‌ఎం ఖాతాలో ఉన్నాయి.

ఈ స్థానాలు పక్కగా ఎం‌ఐ‌ఎం అడ్డాలు …ఇక్కడ వేరే పార్టీకి గెలవడం అసాధ్యం. ఈ స్థానాల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్‌లకే పెద్ద బలం లేదు. అలాంటప్పుడు బీజేపీ ఎలా సత్తా చాటుతుందనేది ప్రశ్నగా మారింది. అయితే ఈ ఏడు స్థానాల్లో బీజేపీకి కాస్త ఓట్లు ఉన్న స్థానాలు వచ్చి..ఛార్మినార్, కార్వాన్, మలక్‌పేట్ స్థానాలు. గతంలో కార్వాన్ సీటు బీజేపీ గెలుచుకున్న సందర్భాలు ఉన్నాయి. 1985, 1989, 1994 ఎన్నికల్లో కార్వాన్‌లో బీజేపీ గెలిచింది. అయితే అప్పటిలో టీడీపీ సపోర్ట్‌ కూడా ఉండేది. కానీ ఇప్పుడు పరిస్తితి వేరు. అయినా సరే గత ఎన్నికల్లో కార్వాన్‌లో బీజేపీకి 38 వేల ఓట్లు వరకు పడ్డాయి. అటు ఛార్మినార్, మలక్‌పేట్ స్థానాల్లో కూడా బాగానే ఓట్లు వచ్చాయి. కాబట్టి ఈ స్థానాల్లో ఎక్కువ ఫోకస్ పెట్టి పనిచేస్తే…ఒక్క సీటులోనైనా గెలిస్తే ఎం‌ఐ‌ఎంకు చెక్ పెట్టినట్లే…మరి చూడాలి ఎం‌ఐ‌ఎంని బీజేపీ నిలువరించగలదో లేదో.

Read more RELATED
Recommended to you

Exit mobile version