బిజెపి ఏపీలో టీడీపీనే కాదు వైసీపీని సైతం టార్గెట్ చేస్తోంది. ఏపీలో బలంగా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డిని లక్ష్యంగా చేసుకుని విమర్శలు చేస్తున్న బిజెపి నేతలు… ఢిల్లీ కేంద్రంగా సరికొత్త రాజకీయం చేసేందుకు కూడా తెర తీస్తున్నారు. ఇప్పటికే టిడిపి నుంచి రాజ్యసభ సభ్యులను తమ పార్టీలో చేర్చుకున్న బిజెపి నేతలు వైసీపీ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది వైసీపీ నుంచి ఎన్నికల్లో 22 మంది ఎంపీలు గెలిచారు. ఈ క్రమంలోనే వైసిపి కేంద్రంతో కోసం చాలాసార్లు మోడీకి బిజెపికి మద్దతు ప్రకటించింది. బిజెపి నేతలు ఏపీలో వైసిపి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నా వైసీపీ నేతలు మాత్రం స్పందించడం లేదు.
ఇదిలా ఉంటే వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన ఇద్దరు జాతీయ స్థాయిలో కాంట్రాక్టులు చేస్తుంటారు. వారి అవసరాలను గుర్తించిన బిజెపి జాతీయ నాయకత్వం వారిపై వల వేసి తమ పార్టీలో చేర్చుకునే ప్రయత్నం కొనసాగిస్తోందని తెలుస్తోంది. అయితే ఈ సమాచారం వైసీపీ నాయకత్వానికి తెలియడంతో వెంటనే ఆ పార్టీ నేతలు అలెర్ట్ అయ్యి ఆ ఇద్దరు ఎంపీలను కంట్రోల్ చేసినట్టు వైసిపి వర్గాలు సైతం ప్రచారం జరుగుతోంది. అయితే వైసిపి నుంచి గెలిచిన ఎంపీల్లో సైతం చాలామందికి తమ వ్యాపార అవసరాల నేపథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అవసరం ఉన్న నేపథ్యంలో ఎప్పుడు… ఎవరైనా… ఎలాంటి నిర్ణయమైనా తీసుకోవచ్చు అని తెలుస్తోంది.
ఇక బిజేపికి రాజ్యసభలో మెజారిటీ లేదు. దీంతో కీలక బిల్లుల ఆమోదం కోసం ఇతర పార్టీల ఎంపీల మీద ఆధార పడక తప్పడం లేదు. ఇక బిజేపికి లోక్‌సభలో అవసరం కంటే ఎక్కువ మంది సభ్యుల మద్దతు ఉంది. అయినా రాజకీయంగా ఏపీ లాంటి రాష్ట్రాల్లో బలపడేందుకు ఇతర పార్టీలకు చెందిన ఎంపీలను లాగేసుకుంటుంది. ఈ క్రమంలోనే వైసీపీలోని ఇద్దరు ఎంపీలతో బీజేపీ నేతలు ఢిల్లీ కేంద్రంగా చర్చలు జరిపారని సమాచారం. ఎన్నికల ముందు నాటి అధికార పార్టీ నుండి వైసీపీలో చేరి ఎంపీలుగా గెలిచిన ఆ ఇద్దరూ వ్యాపార ప్రముఖులే. వారితో బీజేపీ నేతలు సంప్రదింపులు చేసిన మాట నిజమేనని..కానీ వారు పార్టీ మారే ఆలోచన లేదని స్పష్టం చేసినట్లు చెబుతున్నారు.