భారత్ నుంచి ఆస్కార్ కొట్టే సినిమా ఇదే… చిరు, ర‌జ‌నీ, అమీర్ కోరిక కూడా ఇదే

-

నటుడు, దర్శకుడు పార్థిబన్ చిత్రాలు వైవిధ్యంగా ఉంటాయని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ప్ర‌స్తుతం పార్థిబ‌న్ సోలో యాక్ట్ మూవీ చేస్తున్నారు. అంటే ఒక సినిమా మొత్తంలో ఒక్క మనిషి.. ఒకే ఒక్క క్యారెక్టర్..సినిమా అంతా ఒక్క‌డే ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకోవ‌డం.. దీన్నే సోలో యాక్ట్ మూవీ అంటారు. ఇటువంటి సినిమా భారత దేశంలో 1964 తర్వాత ఇదే రావడం. మొత్తం మీద ప్రపంచంలోనే ఇది 19వ సోలో యాక్టర్ మూవీ. జయాపజయాలను పక్కన పెడితే పార్థ‌బ‌న్‌ చిత్రాల్లో కథ, కథనాల్లో  కచ్చితంగా కొత్తదనం ఉంటుంది. అంతే కాదు పార్థిబ‌న్‌ చిత్రాల పేర్లు కొత్తగా ఉంటాయి.

ఈ క్ర‌మంలోనే ఓన్ డైరెక్ష‌న్‌లో  తను ఒక్కడే న‌టిస్తున్న ఈ సోలో యాక్ట్ మూవీ పేరు  ‘ ఒత్త సెరుప్పు సైజ్ 7  ‘ అనగా `ఒక చెప్పు సైజ్ 7` అన్న మాట‌. చాలా తక్కువ సమయంలో రూపొందిస్తున్న ఈ చిత్రం నిడివి 1 గంటా 45 నిమిషాలు ఉండ‌బోతుంది. సినిమా అంతా మనకి పార్థిబన్ ఒక్కడే కనిపిస్తాడు. మిగతా క్యారెక్టర్స్ వాయిస్ మాత్రమే మనకి వినిపిస్తుంది. ఈ చిత్రానికి ఆస్కార్ అవార్డు రావాల‌ని మ‌న స్టార్లు అంద‌రూ కోరుకుంటున్నారు.


మెగాస్టార్ చిరంజీవి, రజనీకాంత్,  అమీర్ ఖాన్, మోహన్ లాల్, కమల్ హాసన్, శంకర్, యశ్మ, మమ్ముట్టి ఇలా ఎంతో మంది అగ్ర తారాగణం పార్థిబన్ చేసిన ప్రయోగం ఆస్కార్ వరకు వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనను అభినందనలతో  పెద్ద స్థాయిలో తమ మద్దతు ప్రకటిస్తున్నారు.

అలాగే ఈ చిత్రానికి సంగీతాన్ని సంతోష్‌నారాయణన్, ఛాయాగ్రహణను రాంజీ అందిస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ పోస్టర్, టీజర్‌లను ఇటీవలే నటుడు విజయ్‌సేతుపతి చేతుల మీదగా విడుద‌ల కాగా మంచి స్పంద‌న ల‌భించింది. విభ‌న్నంగా ఉండ‌బోయే ఈ చిత్రం స‌క్సెస్ సాధించి ఆస్కార్ అవార్డు అందుకుంటుందో.. లేదో… చూడాలి. ఈ చిత్రం ఈ నెల 20వ తేదీన విడుదల కానుంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version