రెండో జాబితా విడుదల చేసిన బీజేపీ

-

మరికొన్ని రోజులలో దేశవ్యాప్తంగా పార్లమెంటు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా పార్టీలు పార్లమెంట్ స్థానానికి సంబంధించిన అభ్యర్థులను ప్రకటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి తొలి జాబితాను బిజెపి ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా రాబోయే లోక్సభ ఎన్నికలకు సంబంధించి బీజేపీ రెండో జాబితా విడుదల చేసింది.72 మందితో కూడిన రెండో జాబితా ప్రకటించింది.ఇందులో తెలంగాణలో ఆరుగురికి చోటు కల్పించింది.మొత్తం 10 రాష్ట్రాలతో పాటు దాద్రా నగర్ హవేలికి సంబంధించిన అభ్యర్థులనూ ప్రకటించింది. ఢిల్లీ (2), గుజరాత్ (7), హరియాణా(6), హిమాచల్ ప్రదేశ్ (2), కర్ణాటక (20), మధ్య ప్రదేశ్ (5), మహారాష్ట్ర(20), త్రిపుర(1), ఉత్తరాఖండ్ (2), దాద్రా నగర్ హవేలి (1) స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.

కాగా, 195 మంది అభ్యర్థులతో కూడిన తొలి జాబితాలో 28 మంది మహిళలకు చోటు కల్పించింది. 47 మంది యువత, 27 మంది ఎస్సీ, 57 మంది ఓబీసీలు ఉన్నారు. 34 మంది మంత్రులు, ఇద్దరు మాజీ సీఎంలకు చోటు కల్పించింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version