తెలంగాణ కాంగ్రెస్ కీలక నేత, నాగర్ కర్నూలు ఎంపీ మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా గాంధీ భవన్ లో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. మధ్యప్రదేశ్ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి రెండు విషయాలు చెప్పారు. ఒకటి గాంధీ, అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చే వారు రాహుల్ గాంధీ వెంట ఉండాలి అన్నారు. మరొకటి గాడ్సెను అనుసరించే వాళ్లు మోడీ, అమిత్ షా వెంట ఉండాలి అన్నారని గుర్తు చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి చేసిన ఈ రెండు స్టేట్ మెంట్ల పై దేశవ్యాప్తంగా చర్చ జరిగిందని మల్లు రవి పేర్కొన్నారు. 140 కోట్ల మంది ఈ అంశాలపై డిస్కషన్ చేవారని తెలిపారు. మహాత్మగాంధీ ఆలోచనలు అమలు చేసే వాళ్లు కాంగ్రెస్ లో ఉన్నారు. గాడ్సె ఆలోచనలు అమలు చేసే వారు బీజేపీలో ఉన్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలోని అన్ని గ్రామాల ప్రజలను చైతన్య పరచాలని రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారని తెలిపారు.