‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’……కేంద్రం నిర్ణయాన్ని స్వాగతించం: షబ్బీర్ అలీ

-

తెలంగాణ రాష్ట్ర విషయంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏడాది సెప్టెంబర్‌ 17వ తేదీన ‘హైదరాబాద్‌ లిబరేషన్‌ డే’ నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఆ రోజు అధికారిక కార్యక్రమాలు నిర్వహించాలని గెజిట్‌లో పేర్కొంది. సెప్టెంబర్ 17ను ‘హైదరాబాద్ విమోచన దినం’గా కేంద్రం ప్రకటించడంపై కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్పందించారు. ‘రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది.మా ప్రభుత్వం సెప్టెంబర్ 17ను హైదరాబాద్ విమోచన దినోత్సవంగా జరుపుకోదు’ అని ఆయన స్పష్టం చేశారు.

కాగా,భారత్‌ స్వాతంత్య్రం పొందాక హైదరాబాద్‌ సంస్థానం 13 నెలల పాటు నిజాంల పరిపాలనలోనే ఉందని కేంద్రం గెజిట్లో తెలిపింది. 1948 సెప్టెంబర్‌ 17వ తేదీన పోలీస్‌ చర్య ‘ఆపరేషన్‌ పోలో’తో ఈ ప్రాంతం భారత్‌లో విలీనమైందని గుర్తు చేసింది. సెప్టెంబర్‌ 17వ తేదీన ‘హైదరాబాద్‌ విమోచన దినం’ నిర్వహించాలని అక్కడి ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారని చెప్పింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version