దేశవ్యాప్తంగా ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి క్రేజ్ ఎక్కువగా ఉన్న సంగతి తెలిసిందే. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతే మోడీని వ్యక్తిగతంగా ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విషయంలో బిజెపి అగ్రనాయకులు కొంతమంది అసహనంగా ఉన్నారని పార్టీ పెట్టిన నాటి నుంచి కూడా ఉన్న కొంతమంది నేతలకు మోడీ వద్ద ప్రాధాన్యత లభించడం లేదని ఆవేదన కొంతమందిలో ఎక్కువగా ఉందని అంటున్నారు.
అందుకే ఇప్పుడు వాళ్ళు అందరూ కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు ఉండవచ్చు అని లెక్కలు వేస్తున్నారు. మోడీ మొండిగా ముందుకు వెళుతూ ఉంటారు. ఇప్పుడు ఆయన ధీమాగా ఆలోచిస్తున్నారు అని కూడా కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే మాత్రం చాలా మంది నాయకులు బీజేపీ గుడ్ బై చెప్పే అవకాశాలు కూడా ఉన్నాయి.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విధానాలను ఎండగట్టడానికి కూడా కొంతమంది బహిరంగంగానే సిద్ధమవుతున్నారు. కాబట్టి పరిస్థితులను మోడీ ఎంత వరకు ఎదుర్కొంటారు ఏంటనే దానిపై చర్చలు ఎక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం అనేది పార్లమెంట్ ఎన్నికల్లో విజయంపై కూడా ఆధారపడి ఉంటుంది అనేది కొంత మంది చెప్పే మాట. మరి ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుందనేది వచ్చే ఎన్నికల వరకు స్పష్టత లేదు.