యాదాద్రి జిల్లా పర్యటనకు మంత్రులు కేటిఅర్, జగదీష్ రెడ్డి బయల్దేరారు. ఈ సందర్భంగా వారికి బిజెపి నేతలు షాక్ ఇచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభించడానికి హైదరాబాద్ నుండి భువనగిరి వెళ్తున్న రాష్ట్ర ఐటి, మున్సిపల్ శాఖ మంత్రి కేటిఅర్ ను అడ్డుకుని ఎల్ఆర్ఎస్ వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఇబ్బంది పెట్టారు.
బిబినగర్ మండలం గూడూరు టోల్ ప్లాజా వద్ద బిజెపి నాయకులు కార్యకర్తలు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీనితో రంగంలోకి దిగిన పోలీసులు, అడ్డుకునే ప్రయత్నం చేసిన బీజేపీ నాయకుల ను కార్యకర్తల ను అరెస్ట్ చేసి బిబినగర్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. వీరిలో బిజెపి కౌన్సిలర్ లు కూడా ఉన్నారు. కాగా ఇటీవల తెలంగాణా ప్రభుత్వం ఎల్ ఆర్ ఎస్ ప్రవేశ పెట్టింది.