సాగర్ ఉప ఎన్నిక పై బీజేపీ స్ట్రాటజీ వేరే ఉందా

-

నాగార్జున సాగర్ ఉప ఎన్నికకు షెడ్యూల్ త్వరలోనే వస్తుందనే ప్రచారం జరుగుతోంది. ఏ పార్టీ కూడా తమ అభ్యర్థులను అధికారికంగా ప్రకటించలేదు.ఇక అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తుది బీజేపీ. పోటీకి పార్టీ లో చాలామంది సిద్ధంగా ఉన్నా ఎవర్నీ ఎందుకు ఫైనల్‌ చేయ చేయడం లేదు..సాగర్ అభ్యర్థి ఎంపిక విషయంలో బీజేపీ స్ట్రాటెజీ ఏంటీ అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

కాంగ్రెస్ పార్టీ నుండి జానా రెడ్డి పోటీ చేయడం ఖరారు అయింది. అటు అధికార పార్టీ నుండి ఎవరు బరిలోకి దిగుతారనేది క్లారిటీ లేదు. అదే సమయంలో బీజేపీ అభ్యర్థి ఎవరనే దానిపై కూడా ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సాగర్‌ ఉప ఎన్నికకు బిజెపి అభ్యర్థిగా చాలామంది పేర్లు తెరపైకి వస్తున్నాయి. కానీ, వారిలో ఎవరి వైపు బీజేపీ మొగ్గు చూపడం లేదట. ఇంకా బలమైన వ్యక్తి కోసం వెతుకుతోందట. అదే సమయంలో అధికార పార్టీకి చెందిన ఒకరిద్దరు గట్టి నేతలకు గాలం వేసే పనిలో కమలం నేతలు ఉన్నారట.

బీజేపిలో చేరుతానని ప్రకటించిన కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి ఫ్యామిలీ నుండి ఎవరినైనా బరిలో దింపొచ్చనే ప్రచారం మరోపక్క సాగర్‌ ఉప ఎన్నికలో విజయశాంతి ని పోటీ చేయించాలని కమలం జిల్లా నేతలు కోరారనే ప్రచారం కూడా నడుస్తోంది. గతంలో అక్కడ పోటీ చేసిన నివేదిత రెడ్డి, అంజయ్య యాదవ్ లు కూడా టికెట్ అడగటమే కాదు.. ప్రచారం కూడా చేసుకుంటున్నారు. వీరితో పాటు, ఈ మధ్య నియోజక వర్గంలో ప్రభావం చూపే నేతలు ఒకరిద్దరు కూడా పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

అయితే ఇంతమంది పేర్లు వినిపిస్తున్నా బీజేపీ పెద్దలు ఎవరికీ ఓకె చెప్పటం లేదు. దుబ్బాక ఉప ఎన్నిక సందర్భంగా అభ్యర్థి విషయంలో ముందు నుండే క్లారిటీ తో ఉన్న బీజేపీ పెద్దలు నాగార్జున సాగర్ విషయంలో ఒక అభిప్రాయానికి రాలేకపోతున్నారు. ఆచితూచి వ్యవహరిస్తున్నారు. దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల తర్వాత బీజేపీకి రాష్ట్రంలో మంచి వాతావరణం ఏర్పడిందని, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో కోల్పోకూడదని కాషాయ నేతలు అనుకుంటున్నారట. గెలుపు గుర్రాన్నే బరిలో దింపాలని స్కెచ్‌ వేస్తున్నారట.

ఈ లెక్కల మధ్య, అభ్యర్థి ఎంపికలో ఆచితూచి వ్యవహరిస్తున్న బీజేపీ, టీఆర్ఎస్‌ తన అభ్యర్థి ని ప్రకటించిన తర్వాతే తమ అభ్యర్థి విషయంలో క్లారిటీకి రావాలనే యోచనలో ఉన్నట్టు సమాచారం. అప్పుడే సరైన క్యాండిడేట్‌ ని బరిలో దింపగలమని భావిస్తున్నారట.

Read more RELATED
Recommended to you

Exit mobile version