మెట్రోమ్యాన్ శ్రీధరన్ తో కేరళలో కమలం వ్యూహం

-

కేరళలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ముందు వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు పలువురు నిపుణులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా..మెట్రోమ్యాన్ శ్రీధరన్‌, కమలం గూటికి చేరనున్నారు. కేరళలో ఉనికి చాటుకోవడమే కష్టంగా ఉన్న కమలదళం మెట్రో మ్యాన్ తో మేజిక్ చేస్తుందా అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో నడుస్తుంది.

భారత్‌లో మెట్రోమ్యాన్‌గా పేరుగాంచిన ప్రముఖ ఇంజినీర్‌ శ్రీధరన్‌ త్వరలోనే రాజకీయాల్లో అడుగు పెట్టబోతున్నారు. త్వరలోనే ఆయన తమ పార్టీలో చేరుతున్నట్లు కేరళ భారతీయ జనతా పార్టీ విభాగం ప్రకటించింది. కేరళలో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సమయంలో శ్రీధరన్‌ బీజేపీలో చేరడం చర్చనీయాంశమైంది. బీజేపీ విజయయాత్రలో పార్టీలో చేరనున్న శ్రీధరన్ పార్టీ ఆదేశిస్తే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు.

బీజేపీ నిర్వహిస్తున్న విజయ్‌ యాత్రలో భాగంగా శ్రీధరన్‌ పార్టీలో చేరుతున్నట్లు సమాచారం. 88ఏళ్ల వయసున్న ఈ మెట్రోమ్యాన్‌… అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, బీజేపీలో చేరే విషయమై శ్రీధరన్‌ ఇటీవలే పలు సందర్భాల్లో మాట్లాడారు.పార్టీ కోరితే ఎన్నికల్లో పోటీ చేసేందుకైనా సిద్ధమేనన్నారు. దేశంలో మెట్రో రైళ్లకు రూపకల్పన చేసిన ఘనత శ్రీధరన్‌కు ఉంది. 2011లో ఢిల్లీ మెట్రో నుంచి పదవీ విరమణ పొందారు.

రాజకీయ రంగ ప్రవేశానికి ముందే శ్రీధరన్ ప్రభుత్వం, వివాదాస్పద అంశాలపై వ్యాఖ్యలు ప్రారంభించారు. తాజాగా లవ్ జిహాద్‌పై వ్యాఖ్యలు చేసి సంచలనమయ్యారు. ఇక ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ను ఓ నియంతగా అభివర్ణించారు. ఈ ముఖ్యమంత్రి పాలనకు పదికి 3 మార్కులు కూడా రావన్నారు. ఆయనసలు ప్రజలతో మమేకమే కారని..ప్రజల్లో ఆయన పట్ల సదభిప్రాయం లేదని చెప్పారు. రాష్ట్రంలోని మంత్రులకు కూడా స్వేచ్చగా మాట్లాడే పరిస్థితి లేదని..అభిప్రాయాలు పంచుకుననే స్వాతంత్ర్యం లేదన్నారు. పార్టీ అధికారంలో వస్తే ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించేందుకు సిద్దమని..మనసులో మాట బయటపెట్టేశారు.

ఎన్నికల ముందు వివిధ పార్టీల నేతలను ఆకర్షించేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. దీనికి తోడు వివిధ రంగాలకు చెందిన నిపుణులను చేర్చుకుంటోంది. దీనిలో భాగంగా మెట్రో మ్యాన్ శ్రీధరన్.. బీజేపీ గూటికి చేరుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version