వ్యక్తిగత ఇమేజ్.. బీజేపీ కలిస్తే విజయమే. ఉప ఎన్నికలు చెబుతున్నది ఇదే..

-

హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించింది. ఈటెలకు ఉన్న వ్యక్తిగత ఇమేజ్ కూడా బీజేపీ విజయానికి కారణమయ్యాయి. 2018 ఎన్నికల్లో కేవలం 1600 ఓట్లకు పరిమితమైన బీజేపీ కేవలం మూడేళ్లలోనే గెలుపొందే స్థాయికి ఎదిగింది. వ్యక్తిగత ఇమేజ్ ప్లస్ బీజేపీ పార్టీ కలిస్తే గెలుపు కష్టమేమీ కాదని ప్రస్తుత విజయాలు నిరూపిస్తున్నాయి. గతంలో కూడా దుబ్బాకలో రఘునందన్ రావు గెలుపు కూడా ఇందుకు ఉదాహరణగా కనిపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పతనావస్థ కూడా బీజేపీకి పరోక్షంగా సహకరిస్తోంది. గతంలో దుబ్బాక, ఇప్పుడు హుజూరాబాద్ రెండు నియోజకవర్గాల్లో రఘునందన్ రావు, ఈటెల రాజేందర్లకు వ్యక్తిగత ఇమేజ్ ఉంది. వీరిద్దరిని రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు గుర్తించే పరిస్థితి ఉంది. రెండోసారి టీఆర్ఎస్ అధికారంలో కి వచ్చిన తర్వాత హుజూర్నగర్, నాగార్జున సాగర్, దుబ్బాక, హుజూరాబాాద్ నియోజకవర్గాల్లో ఎన్నికలు జరిగాయి. అయితే హుజూర్నగర్, నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో బీజేపీ పార్టీకి బలమైన అభ్యర్థి దొరకలేదు. నామ్ కే వాస్తే గా పార్టీలోని ఎవరినో ఒకరిని అభ్యర్థిగా నిలబెట్టింది. దీంతో ఆ ఉప ఎన్నికల్లో బీజేపీ ఊసులోనే లేకుండా పోయింది. అదే హుజూరాబాద్, దుబ్బాకలో విషయానికి వస్తే పరిస్థితి రివర్స్ అయింది. వ్యక్తిగత ఇమేజ్ కు తోడు బీజేపీ తోడైంది. దీంతో బలమైన టీఆర్ఎస్ పార్టీపై విజయం సాధ్యమైంది.

2023లో అధికారమే లక్ష్యంగా పనిచేస్తున్న బీజేపీకి ఈ విషయం తెలియంది కాదు. అయితే రాష్ట్రంలో ఉన్న 119 నియోజకవర్గాల్లో వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నాయకులు దొరుకుతారా.. లేదా..? అన్నదే ఇక్కడ ప్రశ్న. వ్యక్తిగత ఇమేజ్ ఉన్న నాయకుల కోసం బీజేపీ ఎక్కువగా పక్క పార్టీలపైనే ఆధారపడిన పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుతం టీఆర్ఎస్ నాయకులు, పలువురు ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు తమతో టచ్ లో ఉన్నారని బీజేపీ చెబుతోంది. రానున్న రెండేళ్లలో బీజేపీ నియోజకవర్గాల వారీగా ఛరిష్మా ఉన్నా నాయకులను తెరపైకి తీసుకురావాలి. ఇలా అయితేనే ఆపార్టీ 2023లో అధికారం దక్కించుకునే అవకాశం ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version