బీజేపీ అసెంబ్లీ టికెట్ కోసం ఇవాళే లాస్ట్ డేట్ కావడంతో భారీగా దరఖాస్తులు వచ్చాయి. ఇవాళ ఒక్కరోజే ఒక్క రోజే 2781 దరఖాస్తులు వచ్చాయి. సెప్టెంబర్ 4 నుంచి 10 వరకు మొత్తం 6003 దరఖాస్తులు వచ్చాయి. 119 నియోజకవర్గాలకు గాను బీజేపీకి 6003 అప్లికేషన్లు వచ్చాయి. దుబ్బాక నుంచి రఘునందన్ రావు, శేర్లింగంపల్లి గజ్జల యోగానంద్, రాజేంద్ర నగర్ నుంచి కార్పొరేటర్ తోకల శ్రీనివాస్ రెడ్డి, సికింద్రాబాద్ నుంచి మాజీ మేయర్ బండ కార్తీక రెడ్డి, షాద్ నగర్ నుంచి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డి, సనత్ నగర్ నుంచి ఆకుల విజయ, జనగామ నుంచి బేజాది బీరప్ప, పాలకుర్తి నుంచి యొడ్ల సతీష్ కుమార్, ముషీరాబాద్ నుంచి బండారు దత్తాత్రేయ కూతురు బండారు విజయలక్ష్మి, గాంధీ నగర్ కార్పొరేటర్ పావని అప్లై చేశారు.
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల వాతావరణంతో వేడెక్కింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎన్నికల ప్రక్రియలో స్పీడ్ పెంచాయి. అదే తోవలో బీజేపీ కూడా స్పీడ్ పెంచే ప్రయత్నం చేస్తుంది. కేసీఆర్ సర్కార్‌ను డీ కోట్టేందుకు.. ఈ ఎన్నికల్లో తెలంగాణలో అధికారాన్ని దక్కించుకోవాలని బీజేపీ భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి నుంచి వ్యూహ రచనలు సిద్ధం చేసింది. ఇప్పటికే సునీల్ బన్సల్ నేతృత్వంలో బీజేపీ వ్యూహలను రచిస్తోంది. దరఖాస్తుల ప్రక్రియ పూర్తయిన అనంతరం బీజేపీ దూకుడు పెంచుతోంది.