స్కిల్ డెవలప్ మెంట్ స్కాం కేసులో ఏసీబీ కోర్టు తీర్పు పట్ల తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో అరెస్టయిన చంద్రబాబు కోర్టు హాల్లో తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన వద్ద టీడీపీ ఎంపీ కేశినేని నాని, ఇతర నేతలు ఉన్నారు. కాసేపటోఎ్ల తీర్పు వెలువడనున్న నేపథ్యంలో కేశినేని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తీర్పు తమకు అనుకూలంగానే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈ కేసులో పసలేదని, సీఐడీ వాదనలు నిలబడవని అన్నారు. ఇది చంద్రబాబును ఇరికించడం కోసం అల్లిన కేసు అని పేర్కొన్నారు. దేశంలో అవినీతి మచ్చలేని నాయకుల్లో చంద్రబాబు తెలిపారు. కోర్టులో టీడీపీ న్యాయవాదులు బలంగా వాదనలు వినిపించారని వెల్లడించారు.
ఇదిలా ఉంటే.. చంద్రబాబు కేసు తీర్పు కాసేపట్లో వెలువడనుంది. చంద్రబాబుకు బెయిల్ వస్తుందా?లేక రిమాండ్ కు తరలిస్తారా అనేదానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నేపథ్యంలో.. కోర్టు ప్రాంగణం నుండి సుమారు 3 కిలో మీటర్ల మేర తమ అధీనంలోకి తీసుకున్నారు పోలీసులు. మరో వైపు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో విజయవాడ ఏసీబీ కోర్టు దగ్గరకు చేరుకుని చంద్రబాబుకు అనుకూలంగా నినాదాలు చేస్తున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. భారీగా మోహరించిన పారా మిలిటరీ బలగాలు కోర్టు పరిసరాలను ఖాళీ చేస్తున్నారు. కోర్టు పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని తరలిస్తున్నారు. కోర్టు నుంచి 500 మీటర్ల మేర పోలీసులు, భద్రత సిబ్బంది మినహా ఇతరుకు అనుమతివ్వడం లేదు. ఎక్కడిక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.