కేంద్రంలో ఉన్న బీజేపీ, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ తోడు దొంగలని తెలంగాణ రాష్ట్ర పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపించారు. దొంగ సోమ్మును పంచుకోవడమే లక్ష్యంగా ఈ రెండు పార్టీలు కుమ్మక్కైయ్యాయని విమర్శించారు. సింగరేణిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దోపిడికి పాల్పుడుతున్నాయని ఆరోపించారు. దీనికి వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. సింగరేణి దోపిడిపై కేంద్ర ప్రభుత్వానికి ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా.. చర్యలు తీసుకోలేదని అన్నారు.
సింగరేణి దోపిడిలో కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటా ఉందని ఆరోపించారు. అందుకే చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. సింగరేణిలో కేసీఆర్ దోపిడిని కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. అందుకు ప్రతిఫలంగా ఎన్నికల్లో బీజేపీకి కేసీఆర్ నిధులు సమకూర్చుతున్నారని ఆరోపించారు. కాగ కేంద్రంపై పోరాటం అంటూ రాష్ట్ర ప్రజలను కేసీఆర్ మభ్య పెడుతున్నారని అన్నారు.
అలాగే కేసీఆర్ అవినీతి సొమ్ము అంటూ బీజేపీ నాయకులు కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. ఒకరి పై ఒకరు విమర్శలు చేసుకుంటూ.. రాష్ట్ర ప్రజలను మభ్య పెడుతున్నారని మండిపడ్డారు. సింగరేణి దొపిడిపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని ప్రకటించారు.