యూపీలో మళ్లీ బీజేపీనే… ఏబీపీ సీ ఓటర్ సర్వేలో వెల్లడి.

-

దేశవ్యాప్తంగా ఎంతో కీలకమైన ఎన్నికలకు ఇటీవల షెడ్యూల్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్. ముఖ్యంగా 2024 సార్వత్రిక ఎన్నికలకు సెమిఫైనల్ గా ఈ ఎన్నికలకు సెమీఫైనల్ గా 5 రాష్ట్రాల ఎన్నికలను భావిస్తున్నారు. గోవాా, మణిపూర్, ఉత్తర్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగనున్నాయి. వీటిలో అన్నింటి కన్నా ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు కీలకం కానున్నాయి. 400 వందలకుపైగా స్థానాలు ఉన్న యూపీలో గెలుపు కోసం అన్ని పార్టీలు కష్టపడుతున్నాయి. బీజేపీ, సమాజ్ వాదీ పార్టీల మధ్య పోటీ నెలకొని ఉండనుంది.

అయితే తాజాాగా ఉత్తర్ ప్రదేశ్ లో మరోసారి అధికారాన్ని బీజేపీ కైవసం చేసుకుంటుందని… ఏబీపీ సీ ఓటర్ సర్వే అంచనా వేసింది. అయితే గతంతో పోలిస్తే ఈసారి 100 సీట్ల వరకు బీజేపీకి తగ్గుతాయని తెలిపింది. 2017లో బీజేపీకి 312 స్థానాలు రాగా.. ఈసారి 223-235 సీట్లు వస్తాయని అంచానా వేసింది. ఎస్పీకి 145-157 స్థానాాలు, బీఎస్పీకి 8-16, కాంగ్రెస్ పార్టీకి 3-7 సీట్లు వస్తాయని వెల్లడించింది. ఇదిలా ఉంటే పంజాబ్ లో ఆప్ అధికారాన్ని చేజిక్కిచ్చుకుంటుందని తెలిపింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version