పంజాబ్ లో ప్రధాని మోడీ కాన్వాయ్ ని నిరసనకారులు అడ్డుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ ఘటన పై ప్రధానికి అనుకూలంగా క్రీడాకారిణి సైనా నెహ్వాల్ ట్వీట్ చేసింది. అయితే ఈ ట్వీట్ కు అసభ్య పదజాలం తో డబుల్ మీనింగ్ పదాన్ని వాడి హీరో సిద్దార్థ్ ఓ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆ కామెంట్ దుమారం రేపుతోంది. సిద్దార్థ్ చేసిన కామెంట్ పై పలువురు విమర్శలు కురిపిస్తున్నారు. దీనిపై జాతీయ మహిళా కమిషన్ కూడా సిద్దార్థ్ పై కేసు నమోదు చేసింది. అదే విధంగా సింగర్ చిన్మయి సిద్దార్థ్ వ్యాఖ్యలను ఖండించారు.
మరోవైపు బిజెపి ఈ వ్యాఖ్యలపై ఆధ్యాత్మిక గురువు సద్గురు స్పందించారు. సైనా నెహ్వాల్ జాతికే గర్వకారణం….ఆమెపై వ్యాఖ్యలు అత్యంత హేయనేయం. బహిరంగ వ్యాఖ్యలతో పరిస్థితిని ఎటువైపు తీసుకెళతారు. అంటూ పేర్కొన్నారు. ఇక నటి, బిజెపి నేత కుష్బూ సిద్దార్థ్ కామెంట్స్ పై…..సిద్దార్థ్ నువ్వు నా స్నేహితుడి వి కానీ నువ్వు చేసిన వ్యాఖ్యలను నేను ఖండిస్తున్నా…నీ వ్యాఖ్యలను ఆంటీ, అంకుల్ కూడా ఖచ్చితంగా అంగీకరించరు అని చెప్పగలను. ఆ ట్వీట్ దారుణంగా ఉంది. నీలోని విద్వేషాన్ని ఓ వ్యక్తిపై ప్రదర్శించవద్దు. అంటూ కుష్బూ పేర్కొంది.