దేశం లో కరోనా మహమ్మారి కేసులు రోజు రోజుకు పెరిగి పోతున్నాయి. ప్రతి రోజు లక్షకు తగ్గకుండా కరోనా కేసులు ఇండియాలోనే నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో…. ఈ ఏడాది ఐపీఎల్ పై నీలి నీడలు పడుతున్నాయి. కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తున్న తరుణంలో… ఈ ఏడాది కూడా యూఏఈలోనే ఐపీఎల్ నిర్వహిస్తారని గత కొన్ని రోజుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి.
దీంతో ఐపీఎల్ లవర్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఇలాంటి తరుణంలో.. బీసీసీఐ పాలక మండలి ఓ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా కేసులు పెరిగితే… ఐపీఎల్ -2022 టోర్నీని పూర్తిగా ముంబైలోనే నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం అందుతోంది. కరోనా కేసులు విపరీతంగా పెరిగితే… ప్రేక్షకులు లేకుండానైనా… ముంబైలోనే మొత్తం మ్యాచ్‌లు నిర్వహించాలని భావిస్తోంది. ఒకే వేదికలోనే మ్యాచ్ లు నిర్వహిస్తే… ఆటగాళ్లకు కరోనా సోకకుండా ఉంటుందనే భావనలో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది.