ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలతో కూడుకున్న ప్రభుత్వం వైసీపీది : విష్ణువర్ధన్‌ రెడ్డి

-

వైసీపీ ప్రభుత్వంపై ఏపీ బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో బీజేపీ బలపడకూడదనే ఉద్దేశంతోనే… ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో తాము అత్యంత సన్నిహితంగా ఉంటున్నట్టు వైసీపీ పెద్దలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పేద ప్రజల సొమ్మును దోచుకునే పనిలో వైసీపీ ప్రభుత్వం ఉందని విమర్శించారు విష్ణువర్ధన్ రెడ్డి. ల్యాండ్, శాండ్, మైన్, వైన్ మాఫియాలతో కూడుకున్న ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. ఏపీలో డ్రగ్స్, గంజాయి లేవా? అని ప్రశ్నించారు. మంత్రి గుడివాడ అమర్ నాథ్ చెప్పేవన్నీ అబద్ధాలని, ఆయన మహా నటుడని ఎద్దేవా చేశారు. ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులను మోసం చేస్తోందని… వైసీపీ ప్రభుత్వం నిరుద్యోగుల సమస్యను తీర్చి ఉంటే… విజయసాయిరెడ్డి పెట్టిన జాబ్ మేళాకు అంతమంది నిరుద్యోగులు ఎందుకు వస్తారని విష్ణువర్ధన్ రెడ్డి ప్రశ్నించారు.

రాష్ట్రంలో నెలకొన్న సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే సీఎం జగన్ ఢిల్లీ టూర్ కు వెళ్లారని అన్నారు విష్ణువర్ధన్ రెడ్డి. ఏపీని వైసీపీ నట్టేట ముంచిందని దుయ్యబట్టారు. గతంలో ఉన్న పరిశ్రమలకే పెయింట్ కొట్టి కొత్త పరిశ్రమలను తెచ్చామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఉన్నారని విష్ణు చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి. ఈ వ్యవహారంలో ఏపీకి చెందిన నేతలు కూడా ఉన్నారని ఆరోపించారు. ఈ స్కాంలో ఎవరెవరున్నారనే విషయాన్ని విచారణ సంస్థలు బయటకు తెస్తాయని చెప్పారు విష్ణువర్ధన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version