పాదయాత్ర వల్ల సీఎంలు కారు : పవన్‌ కళ్యాణ్‌

-

వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామని జనసేనాని పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో వైసీపీని అధికారంలోకి రానివ్వబోమని స్పష్టం చేశారు. రాజధాని ఎక్కడ అంటే.. చెప్పలేని స్థితికి తీసుకొచ్చారని విమర్శించారు. ఎన్నికల పొత్తుల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో ఏ క్షణం ఏమైనా జరగొచ్చన్నారు. మోదీ, చంద్రబాబు ఇక అసలు కలవరు అనుకుంటే.. కలిశారని.. అలాగే ఏదైనా జరగొచ్చన్నారు. పార్టీ మొత్తంలో కోవర్టులున్నారని నా ఉద్దేశ్యం కాదు.. కానీ ఒకరిద్దరి విషయంలో ఆ ఛాయలు కన్పిస్తున్నాయి. నేను ఓ లక్ష్యంతో వెళ్తున్నప్పుడు.. నన్ను కొందరు వెనక్కు లాగే ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ల వ్యక్తిగత అభిప్రాయాలను.. కోపాన్ని నా మీద.. పార్టీ మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. వ్యక్తిగత అభిప్రాయాలని పార్టీ మీద రుద్దడం వల్లే 2019 ఎన్నికల్లో నష్టపోయాం. మళ్లీ అలాంటి తప్పు ఈసారి చేయదల్చుకోలేదు.

తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ పార్టీలో టీఆర్ఎస్ ను కలిపేస్తానని కేసీఆర్ చెప్పారు. కానీ ఆ తర్వాత మనసు మార్చుకున్నారు.. అది వారి వ్యూహం. అలాగే పార్టీలో మా వ్యూహాలు మాకుంటాయి. వైసీపీ వ్యతిరేక ఓటు చీలకూడదనే బేసిక్ పాయింటుతోనే మా వ్యూహాలు ఉంటాయి. పాదయాత్ర చేసిన వారందరూ వినోభా భావేలు కారు. పాదయాత్ర చేసిన వారు ఆంధ్రా థానోస్ గా మారిన వాళ్లూ ఉన్నారు. నన్ను విమర్శించే ధర్మాన కానీ.. ఇతరులు కానీ.. నాతో పాదయాత్రలో పది అడుగులు వేయాలని కోరుకుంటున్నాను. పాదయాత్ర వల్ల సీఎంలు కారు. నితీష్ కుమార్ ఏ పాదయాత్ర చేసి సీఎం అయ్యారు..? నితీష్ కుమార్ నాలుగు గోడల మధ్యన కూర్చొని వేసిన వ్యూహాలతో సీఎం అయ్యారు. పాదయాత్ర చేయకుండానే ఏక్ నాధ్ షిండే తరహాలో సీఎం కావచ్చు. ఢిల్లీ లిక్కర్ స్కాములో వైసీపీ నేతల పేర్లు వస్తున్నాయి. మూడో ప్రత్యామ్నాయం ఉండడం దేశానికి కానీ.. రాష్ట్రానికి కానీ చాలా అవసరం. బీజేపీకి నచ్చినా.. నచ్చకున్నా.. మూడో ప్రత్యామ్నాయం ఉండాల్సిందే అని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version