వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటు : బీజేపీ విష్ణువర్థన్‌ రెడ్డి

-

మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరంలో ప్రెస్ మీట్ నిర్వహిస్తుండగా, కర్రలు, రాడ్లతో వచ్చిన వ్యక్తులు తీవ్రస్థాయిలో దాడికి పాల్పడడం ఘటనపై బీజేపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. బీజేపీ నేతలపై నేడు ధర్మవరం ప్రెస్ క్లబ్ లో దాడి జరిగిందని విష్ణువర్ధన్ రెడ్డి తెలిపారు. పట్టపగలు… పాత్రికేయుల సమావేశం జరుగుతుండగా వైసీపీ కార్యకర్తలు దాడి చేయడం సిగ్గుచేటు అని మండిపడ్డారు విష్ణువర్ధన్ రెడ్డి. కాగా, ఈ దాడిలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నవారిని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, మాజీ ఎమ్మెల్యే సూర్యనారాయణలతో కలిసి పరామర్శించినట్టు విష్ణువర్ధన్ రెడ్డి వెల్లడించారు విష్ణువర్ధన్ రెడ్డి.

ఈ దాడి ఘటనపై ముఖ్యమంత్రి వెంటనే జోక్యం చేసుకోవాలని ఏపీ బీజేపీ తరఫున డిమాండ్ చేశారు విష్ణువర్ధన్ రెడ్డి . నిందితులను వెంటనే అరెస్ట్ చేసి, ఈ తరహా ఘటనలకు ఈ ప్రభుత్వం అడ్డుకట్ట వేయకపోతే బీజేపీ ప్రత్యక్ష పోరాటానికి దిగుతుందని హెచ్చరించారు విష్ణువర్ధన్ రెడ్డి.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version