కారుకు అందని కమలం..కొత్త ట్విస్ట్‌లతో!

-

అసలు అధికార టీఆర్ఎస్ పార్టీకి చెక్ పెట్టడమే లక్ష్యంగా బీజేపీ దూకుడుగా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే…అయితే రాజకీయంగా ఎప్పటికప్పుడు పైచేయి సాధించేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలతో ముందుకొస్తుంది…ఇక బీజేపీకి చెక్ పెట్టేందుకు టీఆర్ఎస్ సైతం గట్టిగానే ప్రయత్నిస్తుంది. కానీ ఈ మధ్య మాత్రం బీజేపీ రాజకీయం పూర్తిగా మారిపోయింది. అసలు ఒకరోజు అమలు చేస్తున్న వ్యూహం…మరో రోజు ఉండటం లేదు…క్షణక్షణం కొత్త వ్యూహాలతో ముందుకొస్తు…టీఆర్ఎస్ పార్టీకి చుక్కలు చూపిస్తుంది. ఎప్పటికప్పుడు ట్విస్ట్ ల మీద ట్విస్ట్‌లు ఇస్తుంది.

అసలు ఇది బీజేపీ వ్యూహం అని తెలుసుకునే లోపే మరో వ్యూహంతో ముందుకొచ్చేస్తుంది…విజయ్ సంకల్ప్ సభ తర్వాత ఓ రేంజ్ లో బీజేపీ వ్యూహాలు మార్చేస్తుంది. సభ తర్వాత…రాష్ట్రంలో బీజేపీ బలపడటమే లక్ష్యంగా కొత్త కమిటీలు వేసిన విషయం తెలిసిందే…ప్రధానంగా చేరికల కమిటీ పెట్టి దానికి కన్వీనర్ గా ఈటల రాజేందర్ ని నియమించారు. ఇంకా పలు కమిటీలని నియమించారు.

ఈ కమిటీల తర్వాత వెంటనే పార్లమెంట్ స్థానాలని క్లస్టర్లు వారీగా విడగొట్టి…కొందరు కేంద్ర మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. అసలు ఈ క్లస్టర్లు ఏంటి అని చర్చించుకునే లోపే..రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…కేసీఆర్ ప్రభుత్వంపై పోరాటాన్ని ఉదృతం చేశారు..కేసీఆర్ పాలనలో ఉన్న లోపాలని బయటపెట్టేందుకు…ఆర్టీఐకి 80 పైనే దరఖాస్తులు పెట్టారు. అలాగే నియోజకవర్గాల వారీగా పార్టీ బలోపేతం చేసేందుకు సిద్ధమయ్యారు. బండి తన పని తాను చేసుకుంటూ ఉండగానే..ఈటల…తన పని మొదలుపెట్టారు…టీఆర్ఎస్ లోని కీలక నేతలని బీజేపీలోకి తీసుకోచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇది ఇలా నడుస్తుండగానే ఈటల మరో ట్విస్ట్ ఇచ్చారు…వచ్చే ఎన్నికల్లో గజ్వేల్ లో కేసీఆర్ పై పోటీ చేస్తానని ప్రకటించారు. ఈ విషయం బీజేపీ అధిష్టానానికి కూడా చెప్పానని అన్నారు. దీంతో గజ్వేల్ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక కేసీఆర్ ప్రభుత్వానికి చెక్ పెట్టేందుకు కేంద్రం కూడా తమవంతు ప్రయత్నాలు చేస్తుంది..తెలంగాణకు మరో కేంద్ర మంత్రి పదవి ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నారు..ఈ సారి లక్ష్మణ్ కు గాని, బాపూరావుకు గాని పదవి ఇచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. మొత్తానికి ఇలా బీజేపీ ట్విస్ట్ ల మీద ట్విస్ట్ ల ఇస్తూ…టీఆర్ఎస్ ని ఊపిరి సలపనివ్వడం లేదు.

Read more RELATED
Recommended to you

Exit mobile version