హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయం..!

-

హర్యానాలో కౌంటింగ్ మొదలైనప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ భారీ లీడ్ లో కొనసాగింది. ఇక మిగిలింది అధికారికంగా విజయాన్ని ప్రకటించడమే అనుకున్నారు. దీంతో హస్తం ఆఫీసుల్లో స్వీట్స్ పంచుకుని సంబరాలు కూడా చేసుకున్నారు. కట్ చేస్తే తర్వాతి రౌండ్ కే రిజల్ట్ మారిపోయింది. అనూహ్యంగా బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇక అదే ఊపుతో మ్యాజిక్ ఫిగర్ ను కూడా దాటేయడంతో కాంగ్రెస్ కు వెనుకంజ తప్పలేదు.

ఇక ఈసారి మళ్లీ సీన్ కట్ చేస్తే.. బీజేపీ పార్టీ కార్యాలయాల్లో సంబరాలు. ఇదీ హర్యానాలో ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కనిపించిన పరిస్థితి. ఎగ్జిట్ పోల్స్ చెప్పిదంతా తలకిందులు చేస్తూ ఎన్నికల రిజల్ట్ వచ్చాయి. గెలుపు కష్టమనుకున్న బీజేపీ, తప్పక గెలుస్తామనుకున్న కాంగ్రెస్ పార్టీలు రెండూ ఇప్పుడు షాక్ లో ఉన్నాయి. బీజేపీ 48 స్థానాలు, కాంగ్రెస్ 37, ఇతరులు 3, ఇండియన్ నేషనల్ లోక్ దళ్ 2 స్థానాలు గెలుచుకుంది. 1966 నుంచి ఇప్పటివరకు ఏ పార్టీకి సాధ్యం కానీ రికార్డును నెలకొల్పింది. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించింది బీజేపీ.

Read more RELATED
Recommended to you

Exit mobile version