మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ లొల్లి.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

-

గజ్వేల్ లో మాజీ సీఎం కేసీఆర్ కనిపించడం లేదంటూ లొల్లి మొదలయ్యింది అని మెదక్ ఎంపీ రఘునందన్ రావు పేర్కొన్నారు. తాజాగా గజ్వేల్ నియోజకవర్గంలో మెదక్ ఎంపీ రఘునందన్ రావు సమక్షంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎంపీ రఘునందన్ రావు మాట్లాడుతూ.. ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ కి 38 మందిని గెలిపిస్తే.. ఒకరోజు ఆయన జనాల కోసం కొట్లాడలేదు అన్నారు. ప్రజలు BRS కి CRS ఇచ్చారు. మళ్ళీ BRS రావాలని ప్రజలు కోరుకోవట్లేదు అన్నారు.

BRS, కాంగ్రెస్ రెండు పార్టీలు బొమ్మ బోరుసుల్లాంటివి.  ఆ పార్టీ నుంచి ఈ పార్టీ, ఈ పార్టీ నుంచి ఆ పార్టీలో వలసలు కొనసాగుతూంటాయని తెలిపారు. బీజేపీ నుంచి గెలిచిన ఒక్క ఎమ్మెల్యే కూడా పార్టీ మారలేదు. పదేళ్లలో BRS ఎంత బదనం అయ్యిందో.. పది నెలల్లోనే కాంగ్రెస్ అంతా బదనం అయ్యింది అని తెలిపారు ఎంపీ రఘునందన్ రావు. హర్యానాలో బిజెపి పార్టీ ఓడిపోతుందని ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి.  కానీ డబ్బాలు ఓపెన్ చేస్తే బీజేపీనే విజయం సాధించిందని తెలిపారు. జమ్మూ కాశ్మీర్ లో బీజేపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఏదగడానికి మన అధ్యక్షుడు కిషన్ రెడ్డి కృషి చేశారు. తెలంగాణలో ఒక్కసారి బీజేపీ అధికారంలోకి వస్తే.. హర్యానా లాగా మళ్ళీ మళ్ళీ మన ప్రభుత్వమే వస్తుందని తెలిపారు ఎంపీ రఘునందన్ రావు.

Read more RELATED
Recommended to you

Exit mobile version